Vastu Tips for Career । ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోతుంది!-follow these simple vastu tips to ignite your career graph go like a rocket ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Follow These Simple Vastu Tips To Ignite Your Career Graph Go Like A Rocket

Vastu Tips for Career । ఈ వాస్తు నియమాలు పాటిస్తే.. మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోతుంది!

HT Telugu Desk HT Telugu
Dec 18, 2022 07:36 PM IST

Vastu Tips for Career Growth: ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించిన పురోగతి లభించడం లేదా? ఇక్కడ సూచించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించి చూడండి. మీ కెరీర్ మలుపు తిరగటం ఖాయం.

Vastu Tips for Career Growth
Vastu Tips for Career Growth (Unsplash)

జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత ఉద్యోగం చేయాలి, చేస్తున్న ఉద్యోగంలో మంచి పురోగతి ఉండాలి, మంచి గుర్తింపు రావాలని చాలా మంది కలగంటారు. అందుకోసం చాలా కష్టపడతారు కూడా. అయితే వృత్తి జీవితంలో అతికొద్ది మందికి మాత్రమే తగిన గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి సరైన అనుభవం లేకపోయినా ఎక్కువ జీతం తీసుకుంటారు, ఉన్నత స్థానంలో ఉంటారు. ఒకప్పుడు మీ కింద స్థాయిలో పనిచేసే వారు కూడా మిమ్మల్ని మించి పోయి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇది కేవలం వారి సత్తా మాత్రమే కాదు, ఇందుకు వారికి వారి అదృష్టం కూడా తోడవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

అలాగే కొంతమంది ఎంత బాగా పనిచేసినా అందుకు తగిన ప్రతిఫలం లభించక నిరాశలో కూరుకుపోతారు. ఫలితంగా చేస్తున్న పని మీద ఆసక్తి ఉండదు, ఇలా పోటీలో మరింత వెనకబడిపోతారు. కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది. అది కెరీర్ బాగుంటేనే, భవిష్యత్తు అందంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో పురోగతిని సాధించేందుకు మీకు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇందుకోసం వాస్తుశాస్త్రంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీ వృత్తిజీవితంలో సమతుల్యత లభించవచ్చు.

Vastu Tips for Career Growth- వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కోసం వాస్తు నియమాలు

వాస్తు నియమాలు పాటించడం అనేది అత్యంత పురాతనమైన భారతీయ సంప్రదాయం. వాస్తు నిపుణులు కెరీర్ అద్భుతంగా ఉండేందుకు కొన్ని వాస్తు పరిహారాలను సూచించారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

1. ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లో పని చేస్తున్నప్పుడు, వాటిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆగ్నేయ దిశలో ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పనిచేస్తున్నప్పుడు మీ ల్యాప్‌టాప్ , స్మార్ట్‌ఫోన్‌ల ఛార్జర్‌లను చిందరవందరగా చిక్కుముళ్ళతో కాకుండా అన్నీ క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోండి. వీలైతే వాటిని కనిపించని విధంగా సరి చేసి ఉంచండి.

2. పని చేస్తున్నప్పుడు మనం కూర్చునే విధానం కూడా మన పనితీరుపై ప్రభావం చూపుతుంది. వెనుక ఎత్తుగా ఉండే కుర్చీలో కూర్చోండి. ఇది మీ కెరీర్ అవకాశాలను ఎత్తుకు చేర్చడంలో మీకు సహాయపడుతుంది. అలాగే, ఆఫీస్‌లో చెక్క ఫర్నిచర్‌ను ఎంచుకోవడం వల్ల మీ విజయ రేటును వేగవంతం చేయవచ్చు.

3. ఆఫీసులో కూర్చున్నప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశను ఎదుర్కోవడం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. కెరీర్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది. కరోనా తర్వాత ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. కాబట్టి మీరు పనిచేసే చోటునే కార్యాలయంగా మార్చుకోండి. అప్పుడు మీ ఇల్లు కూడా ఒక మినీసైజ్ ఆఫీస్, కాబట్టి ఆ ప్రకారంగానే దిశలను ఎంపిక చేసుకోవడం ఉంటుంది.

4. మీరు పనిచేస్తున్న చోట ఈశాన్య దిశలో సరస్సు, జలపాతం లేదా ఏదైనా నీటి వనరు చిత్రాన్ని ఉంచుకోండి. ఇది మీ కెరీర్ గ్రాఫ్‌ను వేగవంతం చేస్తుంది. అలాగే తూర్పు, ఉత్తర దిశలో తలుపు లేదా కిటికీలు ఉండేలా చూసుకోండి. తలుపులు లేదా కిటికీల చుట్టూ ఎటువంటి అడ్డంకులు లేవని నిర్ధారించుకోండి.

5. వాస్తు ప్రకారం, దీర్ఘచతురస్రాకార వర్క్‌స్టేషన్ కలిగి ఉండటం వృత్తిపరమైన వృద్ధికి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. వర్క్‌స్టేషన్ ఆదర్శ ఎత్తు మీ నాభికి అనుగుణంగా ఉండాలి. ఇది మంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

6. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉండే వర్క్‌స్టేషన్‌లు ఆదర్శంగా పరిగణించబడతాయి, ఎందుకంటే ఇవి గౌరవాన్ని తెస్తాయి.

7. వర్క్‌స్టేషన్‌కు సమీపంలో ఓం, స్వస్తిక లేదా గణేశ విగ్రహం వంటి సానుకూల చిహ్నాన్ని ఉంచండి. ఇది సానుకూలతను ప్రోత్సహిస్తుంది.

8. వాస్తు శాస్త్రం ప్రకారం, వర్క్ డెస్క్‌పై వెదురు మొక్క లేదా దృఢమైన క్రిస్టల్‌ను ఉంచడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది, కెరీర్‌లో పురోగతి పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్‌తో పోరాడటానికి మీ వర్క్‌స్టేషన్‌లో లాఫింగ్ బుద్ధను ఉంచండి.

9. వాస్తు శాస్త్రం ప్రకారం, వృత్తిలో పురోగతిని పొందడానికి నిద్రిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ తూర్పు దిశలో తల ఉంచండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్