New Year Money Tips: కొత్త ఏడాది మీ ఇంట్లొకి లక్ష్మీ దేవి రావాలంటే, ఇళ్లంతా సంతోషంతో నిండాలంటే ఈ పరిహారాలను పాటించండి-follow these remedies to bring happiness and huge money to your home in the new year ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  New Year Money Tips: కొత్త ఏడాది మీ ఇంట్లొకి లక్ష్మీ దేవి రావాలంటే, ఇళ్లంతా సంతోషంతో నిండాలంటే ఈ పరిహారాలను పాటించండి

New Year Money Tips: కొత్త ఏడాది మీ ఇంట్లొకి లక్ష్మీ దేవి రావాలంటే, ఇళ్లంతా సంతోషంతో నిండాలంటే ఈ పరిహారాలను పాటించండి

Ramya Sri Marka HT Telugu
Dec 05, 2024 12:00 PM IST

New Year Vastu Tips: నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఏడాది తమ జీవితం సుఖసంతోషాలతో నిండి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొత్త సంవత్సరలో మీ ఇంట్లోకి లక్ష్మీ దేవీ రావాలంటే, శాంతి, సంతోషాలను ఆహ్వానించాలంటే ఈ పరిహారాలను పాటించాలి.

New year vastu tips
New year vastu tips

ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవ్సతరంలోకి అడుగుపెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. న్యూ ఇయర్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2024 సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో నిండాలని, ఆర్థికంగా మెరుగైన వృద్ధి పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం పాత సంవత్సరాన్ని వదిలి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పు పాటించాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల ఇంట్లోకి ధనం, ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయని నమ్మకం. 2025 నూతన సంవత్సరంలో ఆర్థిక శ్రేయస్సు, ఆనందం కోసం ఎలాంటి వాస్తు పరిహాలను పాటించాలో ప్రముఖ వాస్తు నిపుణులు ముకుల్ రస్తోగి తెలిపారు.

yearly horoscope entry point

నూతన సంవత్సరంలో ఇంట్లోకి లక్ష్మీ దేవిని ఆహ్వానించడం ఎలా?

  • పురాణాల ప్రకారం.. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఇంటిని శుద్ధి చేయడం చాలా ముఖ్యమైనది. ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు శాంతి కలిగించడమే కాకుండా, దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంట్లో ఎక్కడా మలినం లేదా ధూళి ఉండకూడదు. గదులు శుభ్రంగా ఉంచడం ముఖ్యం. పూజ గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసి, అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులు పెట్టడం, పవిత్రమైన వస్తువులు ఉపయోగించడం ఉత్తమం. ఇంటిని పసుపు పాలు లేదా పసుపు నీటితో శుభ్రం చేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది. పాత, అవసరానికి లేని వస్తువులను తొలగించడం ద్వారా ఇంటిలో శుభ్రతను పెంచవచ్చు. ఇంట్లో కాంతి, వెలుతురు పడేలా ముంగిళ్లను తెరిచి ఉంచండి. ఇంట్లో ధనానికి సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉంటే, వాటిని శుభ్రంగా ఉంచడం, వాటి పరిమాణాన్ని, స్థానాన్ని సరిగ్గా ఉంచడం కూడా ముఖ్యం. సువాసనలతో ఇంటిని అలంకరించడం కూడా దేవతలకు ఇష్టమైనది. ఈ విధంగా ఇంటిని శుద్ధి చేస్తే, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.
  • ఇంట్లోని ప్రతి గోడ (టాయిలెట్) తప్ప ఇంట్లోని ప్రతి తలుపుపై పసుపు, కుంకుమలతో స్వస్తిక్ గుర్తును రాయండి. ఇలా చేయడం ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉండటమే కాకుండా జీవితంలో ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
  • ఇంట్లో ఉన్న దేవుడి చిత్ర పటాలన్నింటినీ శుభ్రం చేసి పనుపు నీటితో వాటిని శుద్ధి చేసి అందంగా అలంకరించండి. కర్పూరాన్ని వెలిగించి ఇంట్లోని అన్ని మూలల్లో, ప్రధాన స్థలాల్లో చూపించండి.
  • ఇంటి ఈశాన్యంలో ఒక గిన్నెలో పసుపు ఆవాలను కలిపి ఉంచండి. ఉత్తర దిశలో నీలిరంగు కుండలో స్నేక్ ప్లాంట్ ను పెంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి.
  • ఉత్తర దిశలో ఫౌంటెన్ ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంతోషం వృద్ధి చెందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
  • కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా దిగిన ఫోటలోను ఇంట్లోని తూర్పు లేదా ఈశాన్య దిశలో అమర్చండి. ఇది ఇంట్లోని వ్యక్తుల గొడవలు, చికాకులను దూరం చేస్తుంది.
  • ప్రధాన ద్వారం పైన మూడు నెమలి ఈకలు, పడకగదిలో 11 నెమలి ఈకలను తలపై ఉంచండి. ఇంట్లో నెమిలి ఈకలను ఉంచడం చాలా శుభప్రదమైనది అని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. నెమిలి ఈకలు ఆర్థిక అభివృద్ధిని, లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఆకర్షించడంలో సహాయపడతాయని నమ్మకం ఉంది. ఇవి ఇంట్లో శాంతి, సౌభాగ్యం తీసుకువస్తాయి, దురదృష్టాన్ని దూరం చేస్తాయి. శుభ శక్తులను ఆకర్షించి, ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచే వీలును కలిగి ఉంటాయి. అలాగే, ఈకలు పెట్టడం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తగ్గి ధనసంబంధి పరమైన శుభ ఫలితాలు రావాలని విశ్వసిస్తారు. నెమిలి ఈకలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంటివారికి మానసిక శాంతి, ఆనందం కూడా లభిస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner