కుంభమేళా పర్వంలో పాటించవలసిన కర్తవ్యములు- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
కుంభమేళా స్థలంలో ఎప్పటి వరకూ ఉంటారో అప్పటి వరకు నిష్కపటమైన హృదయంతో స్వార్ధ రహిత ధర్మపరాయణులై ఉండాలి. నిరంతరం భగవంతుని ధ్యానించవలెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కుంభమేళాలో పాటించవలసిన ముఖ్య విషయాల స్నానం, ధనం, ధ్యానం, జపం, తపం మరియు హోమం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కుంభ మేళ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.స్నానం సంకల్ప సహితముగా ఆచరించాలి.
కుంభమేళా స్థలంలో ఎప్పటి వరకూ ఉంటారో అప్పటి వరకు నిష్కపటమైన హృదయంతో స్వార్ధ రహిత ధర్మపరాయణులై ఉండాలి. నిరంతరం భగవంతుని ధ్యానించవలెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఒక నిర్దిష్టమైన సమయంలోనే నదీ స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తం మొదలుకొని, మధ్యాహ్నం 12 గంటల లోపు చేసే నదీస్నానమే పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి, మహా శివరాత్రి, మాఘ మాసం, కుంభ మేళా, పుష్కరాలు వంటి పవిత్ర తిథుల్లో గంగా వంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన ఆత్మ శుద్ధి అవుతుంది. మోక్షం లభిస్తుంది.
బ్రహ్మచారీ వసన్మాసం పితృదేవాంశ్చ తర్పయేత్ |
గంగాయమున యౌశ్చైవ సంగమే స్నానమాచరేత్ ||
బ్రహ్మచర్యవ్రతమును పాటిస్తూ కనీసం ఒక నెలకు మాఘమాసంలో కల్పవాసం చేస్తారో, పితృదేవతలకు తర్పణములు చేయుదురో ప్రతిదినము. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విధిగా గంగా, యమున, సంగమంలో స్నానము చేయుదురో వారు పరమ పుణ్య గతులను తప్పక పొందగలరు.
ఎదుటవారిలో దోషములను చూడకుండా ఆత్మపరిశీలన చేయాలి. కోప తాపములు ఉండరాదు. తీర్ధక్షేత్రం నుండి బయటకు వెళ్ళరాదు. అన్ని వస్త్రములను దానము చేయవలెను. కానీ స్వయంగా ఎవరివద్దనూ దానము తీసుకొనరాదు. స్నానము చేసిన పిదప సంధ్యా తర్పణములు చేసి గణపతిని కలశంలోనికి ఆవాహనంచేసి స్థాపించాలి. శ్రద్ధా, భక్తితో ఆకలశమునకు షోడశోపచార పూజను నిర్వహించాలి. శక్తి కొలది ఆ కలశంలో నెయ్యి నింపి ఒక శుభోదయమున బ్రాహ్మణోత్తమునకు దానము చేయవలెను.
ఈ కంభమేళా పర్వమునకు పైన చూపిన తేదీలలో ఎప్పుడైననూ వెళ్ళవచ్చును. లేదా 2025 జనవరి 13వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 26వ తేదీ వరకు అక్కడే ఉండవచ్చును. అందరూ వెళ్ళి త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ (అలహాబాద్) తీర్ధములో స్నానము చేసి తరంచగలరు. ప్రయాగారాజ్ వెళ్ళుటకు దేశము నలుమూలలనుండి రైలు, బస్సు, విమాన ప్రయాణ సౌకర్యములు కలవు. తప్పనిసరిగా స్నానమాచరించండి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.