Marriage Remedies: ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి అవ్వట్లేదా, ఈ పరిహారాలతో, నెల రోజుల్లో పెళ్ళి బాజాలు మోగడం ఖాయం
Marriage Remedies: పెళ్లి అవ్వాలనుకునేవారు ఈ పరిహారాలని పాటించడం మంచిది. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. కుజుడు శక్తి, ధైర్యం, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే, ఈ గ్రహ ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో అసమతుల్యతను సృష్టిస్తుంది.
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ, కొంతమంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి అవ్వాలనుకునేవారు ఈ పరిహారాలని పాటించడం మంచిది. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. కుజుడు శక్తి, ధైర్యం, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే, ఈ గ్రహ ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో అసమతుల్యతను సృష్టిస్తుంది.

భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఇద్దరు దూరం అవ్వడం, మానసికంగా దూరం అవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వివాదాలకు దారి తీయొచ్చు.
కుజ దోషం
కుజదోషం కారణంగా వివాహంలో ఆలస్యం, వివాహంలో అడ్డంకుల్ని కలిగించవచ్చు. ఇది వ్యక్తి జీవితంలో ఒత్తిడికి కూడా దారి తీస్తుంది.
కుజ దోషం నుంచి బయటపడడానికి ఈ పరిహారాలని పాటించండి
1.కుండతో వివాహం:
ఒక అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే పెళ్లికి ముందు కుండని పెళ్లి చేసుకోవాలని చెప్తారు. అమ్మాయి ఒక మట్టి లేదా లోహపు కుండను వివాహం చేసుకుంటుంది. తర్వాత అది విరిగిపోతుంది.
ఇలా చేయడం వలన అంగారక గ్రహం యొక్క ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ పరిహారం సాంప్రదాయకంగా ప్రభావితంగా పరిగణించబడుతుంది. వైవాహిక సమస్యలు ఎదుర్కొనే వారికి ఇలా కుండతో పెళ్లి చేస్తారు.
2.ఉమ్మెత్త మొక్కతో పెళ్లి
పురుషులకి ఉమ్మెత్త మొక్కతో పెళ్లి చేసే ఆచారం ఉంది. కుజదోషం ప్రతికూల ప్రభావాన్ని తొలగించడానికి ఉమ్మెత్త మొక్కని పెళ్లి చేసుకుంటారు. ఈ పరిహారం కుజదోషం వలన కలిగే అడ్డంకుల్ని తొలగిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది.
3. హనుమంతుడిని ఆరాధించడం
పెళ్లి అవ్వని వారు హనుమంతుడిని ఆరాధించడం మంచిది. హనుమాన్ చాలీసాని చదివి, మంగళవారం నాడు ఉపవాసాలు ఉండడం వలన కుజదోషం తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతాయి.
4.ఈ మంత్రాన్ని పఠించడం
కుజదోషం ఉన్నట్లయితే 'ఓం క్రం క్రీమ్ కరౌమ్ సహ భౌమయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తే మంచిది. మంగళవారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం వలన ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. మానసిక ప్రశాంతతని పొందవచ్చు.
5. దానాలు, ఉపవాసం
ఎర్ర రంగు దుస్తులని, పప్పులను, ఎర్రటి పూలను, రాగి పాత్రలను మంగళవారం నాడు దానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మంగళవారం నాడు ఉపవాసం ఉంటే కూడా కుజదోషం తొలగిపోతుంది.
6.రావి లేదా వేప చెట్టుతో పెళ్లి
పెళ్లి కుదరిని వాళ్ళు కుజదోషంతో ఇబ్బంది పడుతున్న వారు రావి లేదా వేప చెట్టుని పెళ్లి చేసుకోవడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
7.మాంసాహారం, మద్యం
కుజదోషం ఉన్నవారు పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నట్లయితే మాంసాహారం, మద్యం కి దూరంగా ఉండాలి. అప్పుడు కుజ దోషం నుంచి బయటపడొచ్చు.
8.కోపం
కోపం అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుజదోషం ఉన్నవారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం ధ్యానం, యోగా వంటి వాటిపై ఫోకస్ చేయడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం