Garuda Puranam: 2025లో విజయాన్ని అందుకోవాలంటే గరుడపురాణం ప్రకారం ఈ 5 పాటించండి.. ఇక మీకు తిరుగు ఉండదు
హిందువులు ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణం గురించి తప్పక తెలుసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం ఏ సమస్యనైనా సరే పరిష్కరించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే కచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు.
ప్రతి ఒక్కరూ జీవితంలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటారు. అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే, ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన సక్సెస్ అందుకోలేకపోతూ ఉంటాము.
గ్రంథాల ప్రకారం, పుట్టిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతారు. మరణం తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి, కొత్త ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. మరణం పుట్టుకకు సంబంధించిన విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి.
హిందువులు ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణం గురించి తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా కుటుంబ సభ్యుల మరణం తర్వాత పారాయణం చేస్తారు. ఇది కాకుండా మత నియమాలు, ఉపవాసం, పూజల గురించి కూడా గరుడ పురాణంలో చెప్పబడింది.
గరుడ పురాణం ప్రకారం ఏ సమస్యనైనా సరే పరిష్కరించే మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా కనుక మీరు ఆచరించినట్లయితే కచ్చితంగా మీరు విజయాన్ని అందుకుంటారు. మీకు ఎలాంటి ఓటమి ఉండదు.
విజయాన్ని అందుకోవాలంటే గరుడపురాణం ప్రకారం ఈ 5 పాటించండి:
ఉదయాన్నే త్వరగా నిద్ర లేవండి
గరుడ పురాణం ప్రకారం ఉదయం తొందరగా నిద్ర లేవాలి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉదయాన్నే వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మనిషి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఒక వ్యక్తి వ్యాధుల నుంచి బయటపడడానికి గాలి చాలా ఉపయోగపడుతుంది. దీంతో రోజంతా వారు బాగుంటారు. అంతేకాకుండా ఎక్కువ సేపు నిద్రపోయే వ్యక్తికి వయసు తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇది ఆ వ్యక్తికి అశుభ సంకేతం అని గరుడ పురాణం చెప్తోంది.
విజయం కోసం ప్రయత్నం చేయండి
చాలామంది విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి విజయాన్ని అందుకోలేరు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి నిరుత్సాహానికి గురి కాకుండా ఉండాలని గరుడ పురాణంలో చెప్పబడింది. నిరంతర ప్రయత్నాలతో అత్యంత మూర్ఖుడు కూడా విజయం సాధించగలడు అని గరుడ పురాణంలో చెప్పబడింది.
తప్పుడు సాంగత్యానికి దూరంగా ఉండాలి
చాలా మంది రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తప్పు సాంగత్యం ఉన్న వారితో కూడా స్నేహం చేస్తారు. అది మంచిది కాదు. స్నేహితుడిని చేసుకునే ముందు అతని ప్రవర్తనను జాగ్రత్తగా చూసి ఆ తర్వాత మాత్రమే వారితో స్నేహం చేయాలని గరుడ పురాణంలో చెప్పబడింది.
జ్ఞానం, కళలు గురించి గర్వపడకండి
చాలా మంది వారికి ఉన్న జ్ఞానం, కళ వంటివి చూసి గర్వపడుతూ ఉంటారు. సరస్వతి దేవి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే జ్ఞానం, కళ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ గర్వపడకూడదు. అలా గర్వపడినట్లయితే సరస్వతి దేవికి ఆగ్రహం కలుగుతుంది దీని కారణంగా వ్యక్తి యొక్క జ్ఞానమంతా కూడా నెమ్మదిగా పతనం వైపు పయనిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది.
శుభ్రమైన దుస్తులు
శుభ్రమైన దుస్తులు మాత్రమే వేసుకోవాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎప్పుడు కూడా మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకోకూడదు. పరిశుభ్రమైన బట్టలు వేసుకోవడం మంచి ప్రవర్తనని సూచిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం