Maha Shivaratri: వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోవాలంటే, మహా శివరాత్రి నాడు ఈ 4 పరిహారాలను పాటించండి.. ఇక సంతోషాలే
Maha Shivaratri: ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోనున్నాము. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి, రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఆ రోజు ఈ పరిహారాలని పాటించడం మంచిది.

శివరాత్రి నాడు శివుడిని ఆరాధించడం వలన ఎంత గొప్ప ఫలితం ఉంటుంది. పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోనున్నాము. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి, రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
శివుడికి ప్రత్యేక పూజలు చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి నాడు రుద్రాభిషేకం, మహానృత్యుంజయ జపం, శివ చాలీసా పఠించవచ్చు. అలాగే 'ఓం నమః శివాయ' అనే మంత్రన్ని పఠిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి.
శివుని అనుగ్రహం కలగాలంటే ఈ రోజున భక్త శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం మంచిది. ఇది ఇలా ఉంటే చాలా మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగాలన్న, సంతోషంగా ఉండాలన్నా ఈ పరిహారాలని పాటించడం మంచిది.
మహాశివరాత్రి నాడు ఈ పరిహారాలను పాటిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సంతోషం లేకపోయినా ఈ పరిహారాలని శివరాత్రి నాడు అనుసరించడం మంచిది.
మహా శివరాత్రి నాడు పాటించాల్సిన పరిహారాలు:
1.రుద్రాభిషేకం
మహా శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పాలు, తేనే, పెరుగు, నెయ్యి, పంచదార, గంగాజలంతో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి.
2.ఈ మంత్రాన్ని పఠించండి
'ఓం గౌరీ శంకరాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని పఠిస్తే త్వరలో ఏడడుగులు వేసే అవకాశం కలుగుతుంది.
3.నెయ్యితో దీపం
శివరాత్రి నాడు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడానికి, శివుడుని ఆరాధించేటప్పుడు నెయ్యితో దీపాన్ని పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
4.ఓం శం శీం శివాయ శం శం కురు కురు ఓం
'ఓం శం శీం శివాయ శం శం కురు కురు ఓం' మంత్రాన్ని పఠించడం వలన ఒత్తిడి తగ్గుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
ఇలా మహా శివరాత్రి నాడు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. బంధం బాగుంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం