ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీ పరార్.. పేదరికం, దురదృష్టం ఇవేమి ఉండవు-follow these 4 powerful remedies with dried tulasi plant and get luck wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీ పరార్.. పేదరికం, దురదృష్టం ఇవేమి ఉండవు

ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీ పరార్.. పేదరికం, దురదృష్టం ఇవేమి ఉండవు

Peddinti Sravya HT Telugu

కొన్ని సార్లు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తులసి పరిహారాలు బాగా పనిచేస్తాయి. తులసి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి మొక్కను ఉదయం, సాయంత్రం పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. ఎండిపోయిన తులసి మొక్కతో ఈ 4 పరిహారాలను పాటిస్తే, మీ సమస్యలన్నీతొలగిపోతాయి.

ఎండిపోయిన తులసి మొక్క

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం వివిధ రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం తులసి మొక్కకు ప్రత్యేక ప్రార్థననేతనే ఇవ్వబడుతుంది.

కొన్ని కొన్ని సార్లు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తులసి పరిహారాలు బాగా పనిచేస్తాయి. తులసి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి మొక్కను ఉదయం, సాయంత్రం పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

ఎండిపోయిన తులసి మొక్క:

తులసి మొక్క ఎండిపోవడం అనేది మంచిది కాదు. ఇది చెడు ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క ఎండిపోతే దానిని ఇంటి నుంచి తొలగించాలి. మరో తులసి మొక్కను నాటాలి. అయితే, ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండడం మంచిది కానప్పటికీ, ఇది చాలా శక్తివంతమైనది. కొన్ని పరిహారాలను ఎండిపోయిన తులసి మొక్కతో చేయడం వల్ల సంతోషంగా ఉండొచ్చు.

1. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం:

విష్ణుమూర్తి అనుగ్రహం కలగడానికి ఎండిపోయిన తులసి మొక్క కొమ్మలను ఏడు తీసుకుని ఒక దారంతో కట్టి, నేతిలో వేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదుట పెట్టి వెలిగించాలి. ఇలా చేయడం వలన అదృష్టాన్ని పొందవచ్చు. ఇప్పటి నుంచి అదృష్టం కలగక సతమతమయ్యే వారు ఈ పరిహారాన్ని పాటిస్తే, అదృష్టం కలిగి సంతోషంగా ఉండవచ్చు.

2.ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే:

ఎండిపోయిన తులసి ఆకులను గంగాజలంలో వేసి, ఆ నీటిని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

3.ఆర్థిక ఇబ్బందుల నివారణకు:

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే, ఎండిపోయిన తులసి కొమ్మలను చిన్న ముక్కలుగా చేసి, దారం చుట్టి గురువారం నాడు పూజలో ఉపయోగించండి. పూజ తర్వాత వీటిని తీసి ఎర్రటి వస్త్రంలో చుట్టి పర్సులో ఉంచండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

4.సానుకూల శక్తి కలగడానికి:

ప్రతికూల శక్తి వలన ఇబ్బంది పడుతున్నట్లయితే, తులసి వేరుని కడిగేసి, ఎర్రటి క్లాత్‌లో చుట్టి ఇంటి ముందు తగిలించండి. ఇలా చేయడం వలన ఇంటి నుంచి ప్రతికూల శక్తి పోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇలా సులభంగా ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.