Solar eclipse 2024: సూర్య గ్రహణం ఈ మూడు రాశుల జీవితంలో అలజడి కలిగిస్తుంది
Solar eclipse 2024: సూర్య గ్రహణం కొన్ని రాశుల మీద శుభ, అశుభ ప్రభావాలు చూపబోతుంది. అయితే మీ రాశి మీద సూర్య గ్రహణ ప్రభావం ఏవిధంగా ఉండబోతుందో తెలుసుకోండి.
Solar eclipse 2024: ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం చైత్ర మాసం అమావాస్య రోజు ఏర్పడబోతుంది. ఏప్రిల్ 8 న తొలి సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది వస్తున్న తొలి సూర్య గ్రహణం అమెరికాలో కనిపించనుంది. 2017లో వచ్చినట్టుగా ఈ ఏడాది కూడా అత్యధిక సమయం గ్రహణం ఉంటుంది.
ఏడేళ్ళ క్రితం అమెరికాలో కనిపించిన గ్రహణం 2 నిమిషాల 42 సెకన్ల పాటు కొనసాగింది. ఈ సారి ఏర్పడే గ్రహణం సమయం అంతకంటే ఎక్కువగా ఉండనుంది. సుమారు 4 నిమిషాల 28 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాబోతుంది. దీని వల్ల పగలు సమయం రాత్రిగా కనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటు సూర్య గ్రహణం కనిపించే ప్రాంతం మొత్తం చీకటిగా మారిపోతుంది. ఈ ఏడాది అమెరికా, మెక్సికో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది.
మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఉదయం 11.07 గంటలకు ప్రత్యక్షమవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికాలోని 13 రాష్ట్రాలలో కనిపిస్తుంది. పాక్షిక సూర్య గ్రహణం ఉత్తర అమెరికా అంతటా కనిపిస్తుంది.
జ్యోతిష్య, మత విశ్వాసాల ప్రకారం సూర్య గ్రహణానికి ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణం కనిపిస్తే దేవాలయాలు మూసేసి పూజలు నిలిపివేస్తారు. దీన్ని సూతక్ కాలంగా పరిగణిస్తారు. అయితే ఈ సూర్య గ్రహణం భారత్ లో మాత్రం కనిపించదు. అందుకే సూతక్ కాల ప్రభావం కూడా ఉండదు. కానీ కొన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. ఈ సూర్య గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మరికొందరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వచ్చే తొలి సూర్య గ్రహణం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయో చూద్దాం.
వృశ్చిక రాశి
సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావం వృశ్చిక రాశి వారికి అశుభంగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారికి గ్రహణం సమయం కష్టంగా ఉంటుంది. ఉద్యోగం చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
తులా రాశి
తులా రాశి వారికి మొదటి సూర్య గ్రహణం ప్రయోజనకరంగా ఉండదు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసే వాళ్ళు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి.
వృషభ రాశి
ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్య గ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కొన్ని పనులు అలస్యమవుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.