Alcoholic Zodiac Signs: ఈ రాశుల వారు మద్యానికి బానిసలు అవుతారట- ఎవరో, ఎందుకో తెలుసా?
Alcohol Zodiac Signs: రాశులను బట్టి మనిషి వ్యక్తిత్వం ఒక్కో రకంగా ఉంటుందని తెలిసిందే. కానీ, రాశులను బట్టి మద్యం తీసుకునే అలవాటు కూడా మారుతుందట. ముఖ్యంగా ఈ రాశుల వారు మాత్రం కచ్చితంగా ఆల్కహాల్‌కు బానిసలైపోతారట.
మద్యం తీసుకునే సమయంలో ఎంత మంచిగా అనిపించినా, చివరికి ఆర్థిక నష్టంతో పాటు ఆరోగ్య నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు తప్పు జరుగుతుందని తెలిసినా కొందరు మాత్రం మద్యం వైపు ఆకర్షితులవుతూనే ఉంటారు. వారు అలా కావడానికి వారి వారి రాశులు కూడా కారణమవుతాయట. ఏయే రాశుల వారు మద్యానికి బానిసలవుతారో, వారు అలా ఆకర్షితులవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి
ఇతర రాశి గుర్తుల కంటే మీనరాశిలో నీటిని ప్రతిబింబిస్తూ ఉండే గుర్తు ఉంటుంది కాబట్టి మద్యపానానికి ఆకర్షితులయ్యే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఆల్కహాల్‌ను చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ రాశి వారి స్వభావం మద్యం సేవించినప్పుడల్లా మారిపోతూ ఉంటుంది. వారి భావోద్వేగాలు అల్లకల్లోలంగా మారిపోతాయని శాస్త్రం చెబుతుంది. పైగా వీరికి తాగిన తర్వాత కచ్చితంగా సహాయం కావాలి. పక్కనే మంచి చెడులు చెప్పే వ్యక్తి లేకపోతే, వాళ్లకు నచ్చినట్లుగా క్రేజీ పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారికి వయస్సుతో సంబంధం లేకుండా ఆల్కహాల్ తీసుకొంటున్నారంటే కచ్చితంగా పక్కన మరోవ్యక్తిని ఉంచుకోవాలి. వీళ్ల స్వభావం ప్రకారం తాగిన తర్వాత నచ్చిన విషయం కోసం ఒకేసారి అగ్రెసివ్ అయిపోతారు.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు ఆల్కహాల్ తాగడానికి కుతూహల పడుతుంటారు. ఒకవేళ ఈ రాశి వారితో మద్యం తీసుకునే పార్టీకి వెళ్లాలనుకుంటే మీరు కూడా మద్యం ఎక్కువగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువై వాంతులు చేసుకుని మళ్లీ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. తాగిన సమయంలో డైవ్రింగ్ లాంటివి చేయకుండా వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడం బెటర్. మరో రకంగా చెప్పాలంటే, ఈ రాశిచక్రం ఉన్న వారితో మద్యం సేవించడం అనేది సమస్యతోనే ముగుస్తుంది.
మకర రాశి
ఇతర రాశుల కంటే భూమి సంకేతాలు మకర రాశిలో ఎక్కువగా కనిపిస్తాయి. శాశ్వతమైన ఈ సంకేతాలు ఉన్న వారు జీవితంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారు. మిగతా రాశుల వారు తాగి గొడవలు, వాగ్వాదాలకు తిరిగితే వీరు మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తారు.
మేష రాశి
ఈ రాశి వారు సహజంగానే ఆవేశపూరితమైన స్వభావం కలవారు. వీరు తాగి పూర్తిగా పడిపోయేంతవరకూ ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునేది కొంచెమే అయినా ఎక్కువ ఆనందిస్తారు. ఈ రాశి వారు తాగి ఉన్న సమయంలో తక్కువ దృఢంగా, విరక్తితో కూడి ఉంటారు. కానీ, మద్యం తాగి ఉన్న సమయంలో తిరుగుబాటు ధోరణితో కనిపిస్తారు. దాంతోపాటు వాళ్ల ఆవేశం గుర్రాని కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వారిని కంట్రోల్‌లో ఉంచడానికి , ఇతరులకు హాని చేయడం లాంటివి కలగకుండా చూసేందుకు కొంతమంది సంరక్షకులు అవసరం.
మిథునరాశి
ఆల్కహాల్ బానిసగా మారే రాశుల్లో మిధున రాశి కాస్త తక్కువ ప్రభావంతో కూడి ఉంటుంది. మద్యం తీసుకునేందుకు తక్కువ మొగ్గు చూపుతారు. నిజానికి, వారు మానసిక స్థిరత్వానికి విలువ ఇస్తారు. ముఖ్యంగా వీరు తీసుకునే మద్యంపై నియంత్రణతో ఉంటారు. సాధారణ సమయాల్లో మామూలుగా ఉన్నా మత్తులో ఉన్నప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా, దిక్కుతోచని స్థితులలోకి వెళ్లిపోతారు. ఆహ్లాదకరమైన ప్రవర్తన కోసం తీసుకుంటారు కాబట్టి వారికి కొద్దిగా మద్యం తీసుకుంటే సరిపోతుంది.