Fengshui Tips for doors: ఇంటి తలుపులు ఎలా ఉండాలి? ఫెంగ్ షుయ్ నియమాలు తెలుసుకోండి-fengshui tips for doors and what to follow ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Fengshui Tips For Doors: ఇంటి తలుపులు ఎలా ఉండాలి? ఫెంగ్ షుయ్ నియమాలు తెలుసుకోండి

Fengshui Tips for doors: ఇంటి తలుపులు ఎలా ఉండాలి? ఫెంగ్ షుయ్ నియమాలు తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Dec 07, 2024 01:30 PM IST

Fengshui Tips for doors: తప్పుడు దిశలో తలుపులు కలిగి ఉండటం జీవితంపై అశుభ ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది నమ్ముతారు. ఫెంగ్ షుయ్ లో, కొన్ని దిశలలో తలుపులు కలిగి ఉండటం మంచిది కాదట. ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం ఇంటి తలుపులు ఎలా ఉండాలో తెలుసుకుందాం.

ఇంటి తలుపులు ఎలా ఉండాలి? ఫెంగ్ షుయ్ నియమాలు తెలుసుకోండి
ఇంటి తలుపులు ఎలా ఉండాలి? ఫెంగ్ షుయ్ నియమాలు తెలుసుకోండి

ఇంటి తలుపులను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీవితంలో పురోభివృద్ధి, విజయం, పురోభివృద్ధి సాధించవచ్చని ఫెంగ్ షుయ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇది ఇంటికే కాదు ఆఫీసుకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో సమస్యలు వచ్చినా, ఆఫీసులో సమస్యలు వచ్చిన తలుపులు విషయంలో మార్పులు చెయ్యచ్చు. అదే మీరు ఇప్పుడు ఇంటిని లేదా ఆఫీసును నిర్మిస్తుంటే, ఇంటి తలుపులను ఎంచుకునేటప్పుడు ఈ నియమాలను పాటించవచ్చు.

yearly horoscope entry point

అప్పుడు భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. తప్పుడు దిశలో తలుపులు కలిగి ఉండటం జీవితంపై అశుభ ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది నమ్ముతారు. ఫెంగ్ షుయ్ లో, కొన్ని దిశలలో తలుపులు కలిగి ఉండటం మంచిది కాదట. ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం ఇంటి తలుపులు ఎలా ఉండాలో తెలుసుకుందాం.

తలుపు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి:

  1. ఫెంగ్ షుయ్ ప్రకారం, గది తలుపు మధ్యలో కాకుండా మూలలో ఉండాలి.

2. పొడవైన కారిడార్లు, స్తంభాలు దగ్గర ఉండే తలుపు ముందు ఏ విధమైన అడ్డంకి ఉండకూడదు. అది అశుభంగా భావిస్తారు.

3. ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం ఇంటి తలుపులకు పారదర్శక అద్దాలు పెట్టకూడదు.

4. ఇంటికి తూర్పు దిశలో గోధుమ రంగు ద్వారం, పడమర దిశలో తెలుపు, ఉత్తర దిశలో నలుపు, దక్షిణ దిశలో నారింజ రంగు తలుపు ఉండటం మంచిది.

5. ఫెంగ్ షుయ్ లో, తలుపుకు రెండు వైపులా కిటికీలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడదు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

6. ఇంటి తలుపుకు రెండు వైపులా కిటికీలు ఉండకూడదు.

ఈ వస్తువులు ఉంటే ధన లాభం

ఈ వస్తువులు ఉంటే ధన లాభం కలుగుతుందని ఫెంగ్ షుయ్ చెప్తోంది. కాబట్టి వీటిని ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇవి మనకి షాపుల్లో సులువుగా దొరుకుతాయి. ఇంట్లో పెట్టడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు.

విండ్ చిమ్నీస్

ఇవి మనకి షాపుల్లో సులువుగా దొరుకుతాయి. వీటిని ఇంట్లోకి తెచ్చి హ్యాంగ్ చేయొచ్చు. గాలికి అటు ఇటు కదులుతూ మంచి శబ్దాన్ని ఇవి కలిగిస్తాయి. మెటల్ తో చేసినవి, చెక్కతో చేసినవి మనకి దొరుకుతాయి. వీటిని ఇంట్లో అలంకరణగా ఉపయోగిస్తే మంచి జరుగుతుందట.

క్రిస్టల్ తామర పువ్వు

లక్ష్మీదేవిగా తామర పువ్వుని భావిస్తాము. క్రిస్టల్ తామర పువ్వుని ఇంట్లోకి తెచ్చి అందంగా అలంకరిస్తే ధన లాభం కలుగుతుంది. ధనాకర్షణ ఉంటుంది. ప్రేమ చిగురుస్తుంది.

క్రిస్టల్ స్టోన్

క్రిస్టల్ స్టోన్స్ కూడా మనకి దొరుకుతాయి. ధన లాభం కలిగించడానికి ఇవి సహాయపడతాయి. అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి.

డ్రీమ్ క్యాచర్స్

చాలా మంది డ్రీమ్ క్యాచర్స్ ని ఇంట్లో పెడుతూ ఉంటారు. బెడ్రూంలో ఎక్కువగా డ్రీమ్ క్యాచర్స్ ని పెడుతూ ఉంటారు. ఫెంగ్ షుయ్ ప్రకారం వీటిని ఇంట్లో ఉంచడం వలన చెడు కలలు రావు.

Whats_app_banner