ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ధనం కలగడానికి, సంతోషంగా ఉండడానికి వీటిని ఇంట్లో ఉంచడం మంచిది. ఈ వస్తువులను కనుక మీ ఇంట్లో పెట్టినట్లయితే, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంతోషంగా జీవించొచ్చు. ఎలాంటి ఇబ్బందుల అయినా సరే తొలగిపోతాయి. మరి ఫెంగ్ షుయ్ ప్రకారం మనం పాటించాల్సిన వాటి గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకుని నిండా క్రిస్టల్స్, చిల్లర డబ్బులు, రత్నాలు ఇలా మీకు నచ్చిన వాటిని ఆ గిన్నె నిండా నింపండి. దీనిని ఆగ్నేయం వైపు ఉంచడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చాలా లాభాలని పొందడానికి అవుతుంది. డబ్బుని ఆకర్షించడానికి అవుతుంది. సంపద రెట్టింపు అవుతుంది.
లాఫింగ్ బుద్దాను ఇంట్లో ఉంచడం వలన సంతోషం రెట్టింపు అవుతుంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. సంపద పెరుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి అవుతుంది. కాబట్టి లాఫింగ్ బుద్దా కూడా మీ ఇంట్లో ఉంచండి.
ఇంటి లోపల చిన్న వాటర్ ఫౌంటైన్ ని పెట్టుకోవచ్చు. ఇది కూడా సంపదని రెట్టింపు చేస్తుంది. క్రియేటివిటీని పెంచుతుంది. త్వరగా సక్సెస్ ని అందుకోవడానికి సహాయపడుతుంది. వాటర్ ఫౌంటెన్ ఇంట్లో ఉండడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సంపద రెట్టింపు అవ్వడానికి కాసులతో కలిసి ఉన్న కప్పను ఇంట్లో ఉంచండి. ఇది సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటుగా ఆర్థిక లాభాలను కూడా కలిగిస్తుంది. దీంతో సంతోషంగా ఉండొచ్చు, వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది.
క్రిస్టల్ చెట్టుని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. డబ్బులు దాచిపెట్టే చోట కానీ ఆఫీసులో కానీ దీనిని పెట్టుకోవచ్చు. ఇది సానుకూల శక్తిని తీసుకు రావడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. కెరియర్ లో కూడా మంచి సక్సెస్ ని ఇస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం