Magha Purnima 2025: ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ.. ఈరోజు దానంతో దశ తిరిగిపోవచ్చు.. ఏ రాశి వారు ఏం దానం చేయాలో తెలుసుకోండి
Magha Purnima: రాశి చక్రం ప్రకారం మాఘ పూర్ణిమ నాడు వేటిని దానం చేయాలి?, వేటిని దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మత సంప్రదాయాల్లో మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. పంచాంగం ప్రకారం ఈసారి మాఘ మాసం పౌర్ణమి ఫిబ్రవరి 12న వచ్చింది. ఈరోజు పుణ్యస్నానం చేయడం వలన ఎన్నో రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రాశి చక్రం ప్రకారం మాఘ పూర్ణిమ నాడు వేటిని దానం చేయాలి?, వేటిని దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం చేయడం, దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. ఈరోజు చేసే దానానికి ఎన్నో రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. అంతేకాదు ఈరోజు కొన్ని ఆచారాలని పాటించడం వలన మంచి లభిస్తుంది.
దానం చేయడం వలన జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. అదృష్టం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రం ప్రకారం వేటిని దానం చేస్తే శుభ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం
మాఘ పూర్ణిమ నాడు మీ రాశి ప్రకారం వేటిని దానం చేయాలో తెలుసుకోండి
1.మేష రాశి
మేష రాశి వారు పప్పులు, బెల్లం, రాగి వస్తువులు, ఎర్రటి దుస్తులు, గోధుమలు, రాగులు, దానిమ్మ పండ్లు దానం చేయడం వలన మంచి జరుగుతుంది. పనిలో సక్సెస్ ని అందుకోవచ్చు.
2.వృషభ రాశి
వృషభ రాశి వారు బియ్యం, పెరుగు, సువాసన వచ్చే వస్తువులు, పిండి, ఉప్పు దానం చేయడం మంచిది దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ఉంటుంది.
3.మిధున రాశి
మిధున రాశి వారు పెసరపప్పు, ఆకుకూరలు, పుస్తకాలు, ధనియాలు దానం చేయడం వలన సక్సెస్ ని అందుకోవచ్చు.
4.కర్కాటక రాశి
పాలు, వెండి, బియ్యం, తెల్లని దుస్తులు, పంచదార, కొబ్బరికాయ దానం చేయడం వలన మానసిక ప్రశాంతత కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.
5.సింహ రాశి
సింహ రాశి వారు గోధుమలు, బెల్లం, రాగి వస్తువులు, ఎర్రటి దుస్తులు, వేరుశనగ, ఆపిల్ పండ్లు దానం చేయడం వలన కాన్ఫిడెన్స్ ని పెంచుకోవచ్చు. పనిలో సక్సెస్ ని అందుకోవచ్చు.
6.కన్యా రాశి
ఈ రాశి వారు ఆకుపచ్చని దుస్తులు, పెసలు, పుస్తకాలు, పెన్నులు, చెరుకు రసం దానం చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. కెరియర్ లో కూడా అభివృద్ధి ఉంటుంది.
7.తులా రాశి
తులా రాశి వారు తెల్లని దుస్తులు. సువాసన వచ్చే వస్తువులు, బియ్యం, పెరుగు, పంచదార, బంగాళదుంపలు దానం చేయడం వలన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
8.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు పప్పులు, రాగి వస్తువులు, బెల్లం, కొబ్బరికాయ, ఎండుమిర్చి, తేనె దానం చేయడం వలన కోపం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
9.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు పసుపు, పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు దుస్తులు, అరటి పండ్లు వంటి విధానం చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది.
10.మకర రాశి
మకర రాశి వారు ఆవాలు, నల్ల నువ్వులు, మినప్పప్పు, దుప్పట్లు, ఆవాల నూనె దానం చేస్తే శని దోషం నుంచి బయటపడవచ్చు.
11.కుంభ రాశి
కుంభ రాశి వారు నీలం రంగు దుస్తులు, ఐరన్ సామాన్లు, గొడుగు, నల్ల నువ్వులు వంటివి దానం చేయడం వలన సక్సెస్ ని అందుకోవచ్చు. ప్రశాంతత కూడా కలుగుతుంది.
12.మీన రాశి
మీన రాశి వారు పసుపు రంగు దుస్తులు, కుంకుమపువ్వు, పప్పులు వంటివి దానం చేయడం వలన అవకాశాలు వస్తాయి. సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్