వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మిస్తారు. అలాగే ఇంట్లో పెట్టే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఉంచుతారు. ఇలా వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు ఏమి లేకుండా సంతోషంగా ఉండడానికి అవుతుంది.
చాలా మంది ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. కొన్ని అందమైన వస్తువులను కూడా ఇంట్లో పెడుతూ ఉంటారు. ఫ్యామిలీ ఫోటోలని కూడా అందంగా ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఫోటోలకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని పాటించాలి. దీంతో సంతోషంగా ఉండడానికి అవుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. వాస్తు ప్రకారం ఫ్యామిలీ ఫోటోలని పెట్టేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యామిలీ ఫోటోలని ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని నియమాలని కచ్చితంగా పాటించాలి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఫ్యామిలీ ఫోటోలను ఇంట్లో ఉంచడం వలన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. అలాగే అవి ఎన్నో జ్ఞాపకాలని మరచిపోకుండా చేస్తాయి.
లివింగ్ రూమ్ లో ఫ్యామిలీ ఫోటోలని పెట్టేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు గోడలకి పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన ప్రేమానురాగాలు బలపడతాయి.
పడకగదిలో ఫ్యామిలీ ఫోటోలు పెట్టేటప్పుడు నైరుతి వైపు ఉంచడం మంచిది. నైరుతి వైపు పెట్టడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత కూడా ఉంటుంది.
ఫ్యామిలీ ఫోటోలని ఇంటి ముఖద్వారం లేదా హాలులోకి వెళ్లే తోవలో కూడా పెట్టొచ్చు. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. పైగా ఇంటికి వచ్చే అతిధుల్ని ఆహ్వానిస్తున్నట్లు కూడా అర్థం వస్తుంది.
డైనింగ్ ఏరియాలో కూడా ఫ్యామిలీ ఫోటోలని పెట్టుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ సరదాగా భోజనాన్ని తింటారు. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ఫోటోలను పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. బంధాలు బలంగా మారుతాయి.
వాస్తు ప్రకారం బాధ, ఒంటరితనం సూచించే ఫోటోలని ఇంట్లో ఎక్కడా పెట్టకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. సానుకూల శక్తిని దూరం చేస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం