కాశీ మహా క్షేత్రంలోని విశ్వనాథుడు గుడి పక్కన ఉన్న మాత అన్నపూర్ణేశ్వరి ఆలయంలో భక్తులు బంగారపు అన్నపూర్ణమ్మను దర్శించనున్నారు. సంవత్సరానికి ఒకసారి భక్తులకు ఈ దర్శనం లభిస్తుంది.
ఇందుకోసం భక్తులు సంవత్సరం పాటు వేచి ఉంటారు. నవంబరు 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారికి మందిరం మహంత్ శ్రీ శంకర్ పూరి గారు అమ్మవారికి యధావిధిగా పూజ చేసి ధాన్యము, ధనము అమ్మవారికి నైవేద్యం పెట్టి, భక్తులకు అమ్మవారి ప్రసాదం పంచుతారు.
బంగారు అన్నపూర్ణమ్మ వారి దర్శనం 14 నవంబర్ రాత్రి 11:00 వరకు దర్శనం ఉంటుంది. ఇది చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అందులో అధిక సంఖ్యలో మన తెలుగు వారు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి భక్తుడికి అమ్మ వారి ప్రసాదంగా ధాన్యము, ఒక నాణెము ప్రసాదంగా ఇస్తారు. అది మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడూ ధన ధాన్యము తక్కువ లేకుండా ఉంటుందని ఒక నమ్మకం. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
టాపిక్