Ekakshi Narikelam: ఏకాక్షి నారికేళంతో సమస్యలన్నీ తొలగి, సంతోషంగా ఉండొచ్చు.. ఈ పరిహారాలతో జీవితాన్నే మార్చేసుకోవచ్చు
Ekakshi Narikelam: కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నా, వ్రతం చేసుకున్నా, పూజ చేసినా, ఆలయానికి వెళ్లినా సరే మనము కచ్చితంగా కొడుతూ ఉంటాము. ఏకాక్షి నారికేళం గురించి చాలా మందికి తెలియదు. ఏకాక్షి నారికేళం వలన అనేక లాభాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూమతంలో కొబ్బరికాయకి ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. ప్రతీ పూజకు కూడా మనం కొబ్బరికాయని వాడుతూ ఉంటాము. కొబ్బరికాయను ఏదైనా వాహనం కొన్నా, కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నా, వ్రతం చేసుకున్నా, పూజ చేసినా, ఆలయానికి వెళ్లినా సరే మనము కచ్చితంగా కొడుతూ ఉంటాము. కొబ్బరికాయ విశిష్టత పక్కన పెడితే, ఏకాక్షి నారికేళం గురించి చాలా మందికి తెలియదు. ఏకాక్షి నారికేళం వలన అనేక లాభాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్క ఏకాక్షి నారికేళంతో ఇన్ని సమస్యలను తొలగించవచ్చని తెలుసా?
- ఏ ఇంట్లో అయితే ఈ నారికేళం ఉంటుందో ఆ ఇంట్లో దుష్టశక్తులు రావు.
- ఎవరికైనా భూత, పిశాచ బాధలు ఉన్నాయేమో అని అనిపిస్తే, ఏకాక్షి నారికేళాన్ని వారి ఒడిలో పెట్టాలి. అలా చేయడం వలన పీడలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
- కొంతమంది స్త్రీలు సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లో ఏకాక్షి నారికేళంతో ఈ పరిహారాన్ని పాటించడం మంచిది. బిడ్డలు కలగాలంటే రుతు స్నానం తర్వాత ఏకాక్షి నారికేళం తీసుకుని శుభ్రంగా కడిగేసి, ఆ నీటిని తాగాలి. అలా చేయడం వలన గర్భ ప్రాప్తి కలుగుతుంది.
- ఏకాక్షి నారికేళంతో లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..
- కోర్టులో కేసు నడుస్తుంటే దాని నుంచి బయట పడలేకపోతున్నట్లయితే, ఆదివారం నాడు ఎర్ర గన్నేరు పువ్వుని ఏకాక్షి నారికేళం పై పెట్టి, ఆ ఎర్రగన్నేరును జేబులో వేసుకుని తీసుకువెళ్లాలి. అప్పుడు కోర్టులో కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఏకాక్షి నారికేళ మంత్రం:
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం ఏకాక్షయ్ శ్రీఫలాయ భగవతే విశ్వ రూపాయ సర్వ యోగేశ్వరాయ త్రైలోక్య వశ్య కార్య ప్రదాయ నమః
దీపావళి రోజున కానీ, గ్రహణం సమయంలో కానీ ఈ మంత్రం చదివి పూజ చేయడం మంచిది. సంకల్పం చెప్పుకున్నాక పంచామృతంతో అభిషేకం చేయండి. శుద్ధమైన నేతితో దీపాలు వెలిగించాలి, అగరవత్తుల ధూపం చూపించాలి.
వ్యాపారాభివృద్ధి మంత్రం:
శ్రీం హ్రీం ణం మహాలక్ష్మీ స్వరూపాయ ఏకాక్షి నారికేళాయ నమః సర్వసిద్ధి కురు కురు స్వాహా
వ్యాపారంలో అభివృద్ధి జరగాలంటే ఒక వస్త్రం మీద ఏకాక్షి నారికేళాన్ని పెట్టాలి. అష్ట ద్రవ్యాలతో పూజ చేయండి. పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలు వచ్చి కష్టాలు తీరుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.