Ekadanta Sankashti Chaturthi 2024: నేడే ఏకదంత సంకష్టి చతుర్థి.. శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత
Ekadanta Sankashti Chaturthi 2024: ఏకదంత సంకష్టి చతుర్థి శుభ ముహూర్తం ఎప్పుడు? పూజా విధానం? అనుసరించాల్సిన నియమాలు, ఈ చతుర్థి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Ekadanta Sankashti Chaturthi 2024: వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశిని ఏకదంత సంకష్టి చతుర్థి అంటారు. తల్లులు తమ పిల్లలు కోసం, సంతానం పొందడం కోసం ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఏకాదంత సంకష్టి చతుర్థి మే 26వ తేదీ వచ్చింది. ఈరోజున వినాయకుడిని, చంద్ర దేవుడిని పూజిస్తారు. ఏకదంత సంకష్టి చతుర్థి పూజా విధానం, శుభ సమయం, ప్రాముఖ్యత వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
ఏకదంత సంకష్టి చతుర్థి తిథి ప్రారంభం మే 26 సాయంత్రం 6.06 గంటల నుంచి మే 27 సాయంత్రం 4:53 గంటలకు ముగుస్తుంది. ఈ వ్రతం ప్రదోష కాలంలో చేస్తే గణేషుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
ఈ రోజున వినాయకుడిని పూజించడం చేస్తారు. ఏ శుభకార్యమైన వినాయకుని ఆరాధనతోనే ప్రారంభమవుతుంది. అటువంటి పవిత్రమైన చతుర్థి రోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం.
పూజా విధానం
ఉదయాన్నే నిద్ర లేచి పుణ్య స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలు నైవేద్యంగా తయారు చేయాలి. ఉపవాసం ఆచరించాలి. పూజ గదిలో వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్టించి జలాభిషేకం చేయాలి. పూలు, పండ్లు, పసుపు, చందనం సమర్పించాలి. భోగంలో భాగంగా నువ్వుల లడ్డు లేదా మోదక్ సమర్పించాలి. ఏకదంత సంకష్టి చతుర్థి కథను పటించాలి. ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. భక్తిశ్రద్ధలతో వినాయకుడికి హారతి ఇవ్వాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి.
వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో ఇబ్బందులు పడుతున్న వారు వాటిని సరిదిద్దుకునేందుకు ఏకదంత సంకష్టి చతుర్ధి ఉపవాసం ఆచరిస్తే మంచిది. ఈరోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థిస్తే గణేశుడు వారికి శ్రేయస్సు, సంపాదన ప్రసాదిస్తాడని నమ్ముతారు.
ఏకదంత సంకష్టి చతుర్థి చరిత్ర
హిందూ ఇతిహాసమైన మహాభారతాన్ని వ్యాసం మహర్షి చెబుతూ ఉంటే గణేశుడు రచించాడు. ఇతిహాసం రాస్తున్నప్పుడు గణేశుడు తన దంతాలలో ఒకదానిని పోగొట్టుకున్నాడని చెబుతారు. అందుకే ఈ చతుర్థిని ఏకదంత సంకష్టి చతుర్థి అంటారు.
వినాయకుడికి ఈ మూడు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దుర్వా గడ్డి అంటే వినాయకుడికి మహాప్రీతి. విజ్ఞేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు దుర్వా గడ్డిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల భక్తుడు కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పనుల్లో తరచు ఆటంకాలు ఎదురైతే వినాయకుడికి తప్పకుండా దుర్వాని సమర్పించాలి.
వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు కుంకుమ రాయాలి. గణపతి దేవుడికి కుంకుమ పూయడం ద్వారా సంతోషిస్తాడు. కుంకుమ రాయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
వినాయకుడికి లడ్డూలు, మోదకాలు అంటే చాలా ఇష్టం. వీటిని భాగంగా సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకుంటే మంచి జరుగుతుంది.
ఈరోజు గణపతికి పూజ చేయడం ఉత్తమం. ఈరోజు ఎటువంటి తామసిక ఆహారాన్ని ముట్టుకోకూడదు. ఆల్కహాల్, పొగాకు, మాంసాహార పదార్థాలు తీసుకోవడం నిషేధించాలి. పేదలకు డబ్బు, అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు గణేశ అధర్వ శీర్షాన్ని జపించడం మంచిది.