వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 9వ తేదీన శని, బుధుడు వారి స్థానాల్లో ఉంటూ ఒక యోగాన్ని ఏర్పరచబోతున్నారు. శని, బుధుడు ఒకదానికొకటి 30 డిగ్రీల వద్ద ఉండడం వలన ద్విద్వాదశ యోగం ఏర్పడుతుంది. ఈ ద్విద్వాదశ యోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ యోగం వలన ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వేద పంచాంగాన్ని పరిశీలించినట్లయితే జాతకంలో రెండు గ్రహాలు ఒకదానికొకటి రెండవ, 12వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ 30 డిగ్రీల వద్ద సంచరిస్తున్నప్పటి కానీ ఈ ద్విద్వాదశ యోగం ఏర్పడుతుంది.
మే 9 రాత్రి 10:58 గంటలకు బుధుడు, శని ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలో ఉండడం వలన ఈ యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం అనేక లాభాలని అందిస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి.
మకర రాశి వారికి ద్విద్వాదశ యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మతపరమైన ఆచారాల్లో పాల్గొంటారు.
కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు ఉన్నత విద్యకి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. తండ్రి, గురువు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్ళవచ్చు. పిల్లల పురోగతి మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది.
ద్విద్వాదశ యోగం తులా రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పని ప్రదేశంలో కూడా వీరికి కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది. కష్టపడితే ఈ రాశి వారికి ఇది గోల్డెన్ టైం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి వారికి ఈ ద్విద్వాదశ యోగం అనేక మార్పుల్ని తీసుకువస్తుంది. సక్సెస్ ని అందుకోవటంతో పాటుగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. విజయాన్ని అందుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.