హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మార్చి 30 నుంచి చైత్ర నవరాత్రులు మొదలవుతున్నాయి. చైత్ర నవరాత్రులు ఆదివారం నుంచి మొదలుకానున్నాయి. కనుక ఆరోజు అమ్మవారి వాహనం ఏనుగు. చైత్ర నవరాత్రుల్లో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పైగా చైత్ర నవరాత్రులకు ఒక రోజు ముందు శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో నవరాత్రి నాడు కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల్లో మరి మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
నవరాత్రుల సమయంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కెరియర్ లో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
చైత్ర నవరాత్రుల సమయంలో కన్యా రాశి వారికి కూడా కలిసి వస్తుంది. కన్య రాశి వారు డబ్బులు ఆదా చేసుకుంటారు. సమాజ సేవ పై ఆసక్తి పెరుగుతుంది. దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, ఆశీస్సులు లభిస్తాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు కూడా మీపై పడే అవకాశం ఉంది.
తులా రాశి వారికి చైత్ర నవరాత్రుల సమయంలో ప్రయోజనం కలగనుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దుర్గా దేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు. అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడతారు. చిక్కుల నుంచి దూరంగా వస్తారు.
మకర రాశి వారికి నవరాత్రుల సమయంలో కలిసి రాబోతుంది. కెరియర్ లో ఇబ్బందులు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలని పొందవచ్చు. వ్యాపారులకి కూడా ఆర్థిక లాభం కలగనుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. వారి నుంచి శుభవార్తలు వింటారు. దుర్గా దేవి అనుగ్రహంతో కోరుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం