చైత్ర శుక్ల పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు చైత్ర నవరాత్రులని జరుపుతారు. చైత్ర నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో దుర్గాదేవిని ఆరాధించి ఉపవాసం కూడా చేస్తారు. దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి, సంతోషంగా ఉండడానికి ఈ తొమ్మిది రోజులు పూజలు చేస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారికి దుర్గాదేవి ఎల్లప్పుడూ మంచి చేస్తుంది, ఈ రాశుల వారంటే దుర్గాదేవికి చాలా ఇష్టం. ఈ రాశుల వారికి నిత్యం సంతోషం ఉండేటట్టు దుర్గాదేవి చూస్తుంది, మరి దుర్గాదేవి అనుగ్రహం ఏ రాశులు వారికి ఉంటుంది?, ఏ రాశుల వారంటే దుర్గాదేవికి ఎంతో ఇష్టం వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
దుర్గాదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఆనందంతో పాటుగా విజయం, ధనం కూడా ఉంటాయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులే ఉండవు. పేదరికం కూడా సంభవించదు. దుర్గా దేవికి ఈ మూడు రాశులు వారంటే ఎంతో ఇష్టం. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి.
దుర్గాదేవికి వృషభ రాశి వారు అంటే ఎంతో ఇష్టం. వృషభ రాశి వారికి ఎప్పుడూ దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. ఎల్లప్పుడూ సక్సెస్ ని అందుకుంటారు. పేరు, ప్రతిష్టలు కలగడంతో పాటుగా ధనాన్ని కూడా పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వుండవు.
దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తారు. దుర్గాదేవికి సింహ రాశి వారు అంటే కూడా ఎంతో ఇష్టం. ఈ రాశి వారు ఎల్లప్పుడూ విజయాన్ని అందుకుంటారు. పైగా సింహ రాశి వారు పుట్టుకతోనే నాయకులు. బాగా డబ్బు సంపాదించడంతో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం