Karthika Pournami: ఈ శుభ యోగాల కారణంగా కార్తీక పౌర్ణమి నాడు ఈ పనులు చేస్తే 100రెట్లు ఫలితం దక్కుతుంది
Karthika Pournami: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈ సారి కార్తీక పౌర్ణమి రోజుకు మరింత ప్రత్యేకంగా వచ్చింది. రెండు, మూడు శుభయోగాలు ఒకే రోజు ఏర్పడటం వల్ల ఈ రోజున చేసే కొన్ని పనులు 100 రెట్లు శుభ ఫలితాలను ఇస్తాయి.
కార్తీకపౌర్ణమికి హిందూ పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున దేవతలంతా కలిసి దీపావళి పండుగను జరుపుకుంటారు. దీన్నే దేవ్ దీపావళి అని పిలుస్తుంటారు. ఈ సారి కార్తీక పౌర్ణమి పర్వదినం 2024 నవంబర్ 15 శుక్రవారం రోజు వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. పౌర్ణమి తిథి నవంబర్ 15 ఉదయం 5:22 గంటలకు ప్రారంభమై నవంబర్ 16 తెల్లవారుజామున 3:09 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున చాలా మంది భక్తులు సత్యనారాయణ వత్రం, లక్ష్మీ పూజా, విష్ణుమూర్తి, శివుడి వంటి దేవతల ఆరాధన చేస్తుంటారు. కార్తీకపౌర్ణమి నాడు చాలా మంది దీపాలను వెలిగించి గంగలో వదిలేస్తుంటారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానాలు, దానధర్మాలు చేస్తారు. చాలా చోట్ల గంగా ఘాట్ వద్ద దీప దానాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు శాంతి కలుగుతాయని నమ్ముతారు.
ఈ సారి కార్తీకపౌర్ణమికి మరో ప్రత్యేకత ఏంటంటే.. చంద్రుడు, కుజుడు ఒకరి రాశిచక్రంలో మరొకరు సంచరిస్తూ రాశిచక్ర మార్పు యోగాన్ని సృష్టిస్తారు. ఈ రోజున గజకేసరి యోగం, బుద్ధాదిత్య రాజ యోగం కూడా ఒకేసారి జరుగుతున్నాయి . అలాగే, ఈ కార్తీక పౌర్ణమి నాడు శని కుంభ రాశిలో ఉండటం వల్ల శని రాజ యోగం కూడా ఏర్పడుతుంది. ఈ రోజున శని తన రాశి అయిన కుంభ రాశిలో ఉండబోతున్నాడు. ఇన్ని శుభయోగాలు కలగలిపి ఉండటం వల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసిన పూజలకు, దాన ధర్మాలకు వంద రెట్టు ఎక్కువ ఫలితాలు రానున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నాయి. ప్రతి పుణ్యకార్యానికి నూటికి నూరు పాలు ఫలితం దక్కి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనున్నాయని నమ్ముతున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వత్రం ఆచరించడం శుభప్రదం.
దేవ దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో, ఆలయంలో, నది లేదా చెరువులో దీపాలను వెలిగించి దానం చేయడం అత్యంత శుభపరిణామంగా చెబుతారు. దీపం దానం కంటే పవిత్రమైన దానం మరొకటి లేదని అగ్ని పురాణంలో పొందుపరిచారు.
అన్నదానం చేయడం చాలా మంచిది. ఆహారం జీవితంలో గొప్ప వరం. ఒక వ్యక్తి ఇంట్లో ఆహారానికి కొరత లేదని నమ్ముతారు.
మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున బట్టలు దానం చేయాలి. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వస్త్రాలు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుందని చెబుతారు.
కార్తీక పౌర్ణమి నాడు నువ్వులు దానం చేయండి. దీంతో శివుడు సంతోషించి భక్తులపై ఆశీర్వచనాలు కురిపిస్తాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.