సాధారణంగా మనం నిద్ర పోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. నిద్రలో వచ్చే కలలు మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలని చెప్తూ ఉంటాయి. ఒక్కోసారి మనకి చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపించే కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మాత్రం భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. ఇటువంటి కలలు వచ్చాయంటే మాత్రం రోజంతా భయపడిపోతూ ఉంటాము. ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో, సమస్యలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటాము. ఇలాంటి కలలు వస్తే దానికి సంకేతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి ఎవరైనా చనిపోయినట్లు లేదంటే చనిపోయిన వారు కలలో కనపడటం, మండుతున్న చితి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే ఇలాంటి కలలు వస్తే దాని వెనక అర్థం ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి నిద్రపోయినప్పుడు అంత్యక్రియలు జరుపుతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, ఇలాంటి కలలు రావడం శుభసంకేతం. ఇలాంటి కలలు వస్తే కలలో కనపడిన వ్యక్తి ఆయుషు పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు మంచి శుభవార్తని వింటారని కూడా అర్థం.
మీ కలలో మృతదేహం కనపడితే, మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. కొన్ని విషయాలు గురించి గందరగోళంలో ఉన్నట్లయితే వాటి గురించి నిర్ణయం తీసుకోవాలి అని ఈ కల సూచిస్తుంది.
మండుతున్న చితి కనుక కలలో కనపడితే అశుభం. భవిష్యత్తులో గొడవలు జరగబోతున్నాయని లేదంటే ఎవరినైనా మీరు కోల్పోవాల్సి ఉంటుందని ఈ కల వెనుక అర్థం. ఇలాంటి కలలు వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మీకు మీరుగా చనిపోయినట్లు కల వస్తే మంచిది. త్వరలోనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని అర్థం. రాబోయే రోజుల్లో శుభ ఘడియలు ఉంటాయని ఈ కల చెప్తుంది.
చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనపడితే కూడా మంచిదే. వారు నవ్వుతూ లేదా ఆశీర్వదిస్తూ కనబడితే త్వరలో అనేక ప్రయోజనాలని పొందుతారని అర్థం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం