Zodiac Dream Vacation: రాశికో డ్రీమ్ వెకేషన్ - మీ రాశిని మీ బట్టి డ్రీమ్ లొకేషన్ ఏంటో తెలుసుకోవచ్చు!
Zodiac Dream Vacation: ఒక్కో రాశి చక్రం ఉన్న వారికి విభిన్న వ్యక్తిత్వ లక్షణాలున్నట్లే వారి డ్రీమ్ వెకేషన్స్ కూడా మారతాయట. సాహసాలను ఇష్టపడే మేషం నుంచి మాల్దీవులకు చేరుకోవాలని కలల్లో గడిపే మీనం వరకూ విభిన్న స్వభావాలు ఉన్నవారుంటారు.
మేషం నుంచి మీనం వరకూ ఉన్న 12 రాశుల వారు ఒక్కో వ్యక్తిత్వంతో, ఒక్కో లక్షణంతో ఉంటారు. వారి ఆకాంక్షలను బట్టి, వారి గమ్యాలు మారుతుంటాయి. ఒక్కో ప్రదేశంలో ఉండే వాతావరణాన్ని బట్టి వారి స్వభావానికి తగ్గట్టు ఎంచుకుంటారు. మరి ఆయా రాశుల వారు ఏయే వెకేషన్లకు వెళ్లడానికి ఇష్టపడతారో తెలుసుకుందాం.
మేషం:
వీరి వ్యక్తిత్వం సాహసోపేతంగా ఉంటుంది. వర్షారణ్యాల ప్రాంతం కావడంతో జీప్-లైనింగ్, అందమైన బీచ్ లలో సర్ఫింగ్ చేయడం, అగ్ని పర్వతాలను అధిరోహించడం వంటి అడ్వెంచేరియస్ ప్రయత్నాలు చేయడానికి సిద్ధపడతారు.కోస్టారికా ప్రదేశపు అనుభూతి వారి విశ్రాంతి కోరని స్వభావానికి సరిగ్గా సరిపోలుతుంది.
వృషభం:
ఈ రాశి వారు సౌకర్యవంతంగా, లగ్జరీతో ఉండే వాతావరణం ఇష్టపడతారు. బీచ్‌లలో సన్ బాత్, ఆకర్షణీయమైన రెస్టారెంట్లలో రుచికరమైన వంటకాలు, సెయింట్ ట్రోఫెజ్ వంటి బీచ్ పట్టణాల గుండా నడవడం వంటివి ఇష్టపడతారు. వీటితో పాటుగా విలాసవంతమైన భోజనం, వైన్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరికి సరిగ్గా సూట్ అయ్యేది ఫ్రెంచ్ రివేరా ప్రదేశం.
మిధునం:
వీరు ప్రేమికులు అంతేకాకుండా రొటీన్ పనులను ఎక్కువగా ఇష్టపడరు. జపాన్ లో ఉండే థ్రిల్లింగ్ కల్చర్ పర్యటనను అద్భుతంగా మారుస్తుంది. టోక్యో వీధుల్లో కనిపించే దేవాలయాలు వాటిల్లోని ప్రశాంతతను వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ పట్టణ వాతావరణం, చారిత్రక సందర్శనలతో అప్రయత్నంగానే సమన్వయపరుస్తుంది. అంతేకాకుండా వేగవంతమైన నగర జీవితం ఎప్పటికీ ఉత్సాహవంతంగానే ఉంచుతుంది.
కర్కాటక రాశి:
శక్తివంతమైన, అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించగలిగే స్వభావమున్న ఈ రాశి వారు స్కాటిష్ ఐలాండ్స్ లోని రహస్య ప్రదేశాల్లో తిరగడాన్ని ఇష్టపడతారు. అందమైన చిన్న కాటేజీలలో కూడా సర్దుకుపోగలరు. మనస్సును ఉల్లాసంగా ఉంచే వేడి వేడి వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రకృతి, భావోద్వేగాలను ముడిపెట్టి కాలాన్ని గడుపుతూ శాంతి ప్రపంచంలో అనుభూతి చెందుతారు.
సింహరాశి
సింహరాశికి గమ్యస్థానం ఇబిజా. జీవితాన్ని అన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. పురాణ ద్వీపంలో ఉండే అందమైన బీచ్ లు, లేటెస్ట్ ట్రెండ్ తో గడుపుతున్న నైట్ లైఫ్, లగ్జరీ రిసార్ట్ లు వీరికి బాగా నచ్చుతాయి. ప్రత్యేకమైన పార్టీలు, సన్-కిస్డ్ బీచ్‌లు, ఉల్లాసవంతమైన వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు.
కన్య
ఈ రాశి వారు రియాలిటీని, ప్రశాంతతను ఇష్టపడుతుంటారు. బాలిలో ఉండే వెల్నెస్ రిట్రీట్ వీరికి బాగా సూట్ అవుతుంది. అంతేకాకుండా యోగా కోర్సులు, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం అన్నీ ఒకే చోట దొరికే బాలి వీరికి బాగా నచ్చుతుంది. ప్రశాంతత వారిని రీఛార్జ్ చేయడానికి ఉపయోగకరమవుతుంది.
తుల
వీరి స్వభావాన్ని బట్టి శృంగార ప్రియులుగా ఉంటారు. వీరికి వెనిస్ బాగా సెట్ అవుతుంది. సుందరమైన కాలువలపై సరదాగా షికారు చేయవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్లు, చక్కటి అందమైన నిర్మాణాలు, మనసులను కట్టిపారేసే కట్టడాల మధ్య శృంగారంలో కొత్త అనుభూతులు వెతుక్కోవచ్చు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు అనుమానాస్పద వ్యక్తులు. వీరికి రహస్యం, ఎమోషన్ వంటి ఫీలింగ్స్ ప్రతిబింబించే ప్రదేశాలను ఇష్టపడతారు. ఐలాండ్స్ పై ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఈ ఫాంటసీ ల్యాండ్ స్కేప్స్ ను చూసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. జానపద కథల గొప్పతనం, నాటకీయమైన ప్రకృతి సౌందర్య దృశ్యాలను ఇష్టపడతారు.
ధనుస్సు
ఈ రాశి వారు సాహసోపేతంగా ఉంటారు కాబట్టి హైకింగ్, నైట్ లైఫ్ వీధుల్లో షికారు చేయడాన్ని ఇష్టపడతారు. కొత్త విషయాల అన్వేషణ, సాంస్కృతిక అనుభవం కోసం పరితపిస్తుంటారు. స్వేచ్ఛా స్వభావంతో అందాలను అనుభవించే వారికి సౌత్ అమెరికా మంచి వెకేషనల్ లొకేషన్.
మకరం
వీళ్లకు సంప్రదాయాలను గౌరవించడం, కష్టపడి పనిచేయడం ఇష్టం. కాబట్టి రోమ్ ప్రదేశాన్ని వీళ్లు బాగా మెచ్చుతారు. పురాతన శిథిలాలను సందర్శించేందుకు, ఇటాలియన్ ఆహారాన్ని రుచి చూసేందుకు వీలుంటుంది.
కుంభం
వినూత్నమైన ప్రదేశాలను కనుగొనేందుకు సాహసోపేతమైన ప్రయాణాలను ఇష్టపడతారు. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను చూసేందుకు ప్రయత్నిస్తారు. బంగీ జంప్ వంటి థ్రిల్లింగ్ పనులు చేయడానికి ఇష్టపడతారు. న్యూజిలాండ్ లోని రోటోరువాలోని భూఉష్ణ అద్భుతాలను బాగా ఎంజాయ్ చేస్తారు.
మీనం
మాల్దీవులకు వీరి డ్రీమ్ వెకేషన్ అని చెప్పొచ్చు. ఊహాత్మక వ్యక్తులే కాకుండా సృజనాత్మకతతో ఉంటారు. మాల్దీవులు వంటి భూతల స్వర్గ ప్రదేశాలను బాగా ఇష్టపడతారు. బీచ్ లలో పడుకోవడం, స్వచ్ఛమైన నీటిలో స్నార్కెలింగ్ చేయడం, సూర్యాస్తమయాలను చూసి ఆస్వాదిస్తుంటారు.