ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ఏ దిశలో ఉంటే మంచిది? ఇలా చేస్తే సానుకూల శక్తితో పాటు ఎన్నో!-dream catchers vastu tips follow these for positive energy and happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ఏ దిశలో ఉంటే మంచిది? ఇలా చేస్తే సానుకూల శక్తితో పాటు ఎన్నో!

ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ఏ దిశలో ఉంటే మంచిది? ఇలా చేస్తే సానుకూల శక్తితో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

వాస్తు ప్రకారం ఫాలో అయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. చాలా మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎక్కువ మంది ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ని కూడా పెడుతూ ఉంటారు. ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ఏ దిశలో ఉంటే మంచిది? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ఏ దిశలో ఉంటే మంచిది? (pinterest)

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. వాస్తు ప్రకారం ఫాలో అయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. చాలా మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ప్రతీ ఒక్కరు కూడా ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకుంటారు. అందుకోసం వివిధ వస్తువుల్ని అలంకరణ కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

ఎక్కువ మంది ఇంట్లో డ్రీమ్ క్యాచర్స్ ని కూడా పెడుతూ ఉంటారు. డ్రీమ్ క్యాచర్స్ సానుకూల శక్తిని తీసుకువస్తాయి. మంచి నిద్రని అందిస్తాయి. అమెరికన్ సంస్కృతి అయినప్పటికీ భారతదేశంలో కూడా చాలా మంది వీటిని ఇంట్లో పెడుతున్నారు. వీటి వలన అనేక మార్పులను చూడవచ్చు. డ్రీమ్ క్యాచర్స్ కి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రీమ్ క్యాచర్స్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఈ వాస్తు నియమాలని పాటించండి

కొన్ని నియమాలని పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండవచ్చు. డ్రీమ్ క్యాచర్స్ ని పెట్టేటప్పుడు వాస్తు ప్రకారం వాటిని ఉంచడం చాలా ముఖ్యం. మరి ఎటువంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం.

1.సరైన దిశ

వాస్తు ప్రకారం వీటిని వాయువ్యం వైపు ఉంచితే మంచిది. ఇలా ఉంచినట్లయితే సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా ఇంట్లో ప్రేమానురాగాలు ఉంటాయి. పడక గదిలో పెట్టాలనుకుంటే మంచానికి పైన లేదంటే నిద్రపోయేటప్పుడు తల ఏ వైపు ఉంటే ఆ వైపు పెట్టుకోవడం మంచిది. ఇలా ఉండడం వలన పడకగదిలో ప్రశాంతత ఉంటుంది.

2.ఇలాంటి వాటిని పెడితే మంచిది

డ్రీమ్ క్యాచర్స్ ని పెట్టేటప్పుడు సహజమైన వాటితో తయారు చేసినవి అయ్యి ఉండేటట్టు చూసుకోండి. కాటన్, దారాలు, ముత్యాలు, సహజమైన ఈకలతో తయారు చేసిన వాటిని కూడా ఇంట్లో పెడితే మంచిది.

3.శుభ్రం చేస్తూ ఉండండి

ఎలా అయితే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటామో డ్రీమ్ క్యాచర్స్ ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎండలో ఆరబెడితే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.