Dream Astrology: నిద్రపోయినప్పుడు ఈ 5 కలలు వస్తే.. మీ అదృష్టం మారుతుంది, మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది-dream astrology these 5 dreams brings lots of luck wealth and lakshmi devi blessings check this now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dream Astrology: నిద్రపోయినప్పుడు ఈ 5 కలలు వస్తే.. మీ అదృష్టం మారుతుంది, మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది

Dream Astrology: నిద్రపోయినప్పుడు ఈ 5 కలలు వస్తే.. మీ అదృష్టం మారుతుంది, మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది

Peddinti Sravya HT Telugu

Dream Astrology: స్వప్న శాస్త్రం ప్రకారం కలల వెనక అర్ధాలు కూడా ఉంటాయి. ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది. ఎటువంటి కలలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది? ఎటువంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వస్తే జీవితమే మారిపోతుంది (pinterest)

మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాము. ఒక్కోసారి మనకి కలలు గుర్తే ఉండవు. కొన్ని కొన్ని సార్లు ఏదైనా కల వస్తే దాని వెనక అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోలేని అనుకుంటాము. స్వప్న శాస్త్రం ప్రకారం కలల వెనక అర్ధాలు కూడా ఉంటాయి. ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది.

స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వచ్చినట్లయితే అదృష్టం కలిసి వస్తుందట. నిజానికి భవిష్యత్తులో అనేక మార్పులు వస్తాయట. మంచి గడియలు సమీపిస్తున్నాయని ఈ కలలు సూచిస్తాయి. మరి ఎటువంటి కలలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది..? ఎటువంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వస్తే జీవితమే మారిపోతుంది

1.కలలో చీపురు

చాలా మందికి కలలో చీపురు కనపడుతూ ఉంటుంది. చీపురుకట్ట కనపడితే అదృష్టం త్వరలోనే మీ వద్దకు చేరుతుందని అర్థం. ఒకవేళ కనుక కలలో చీపురు కనపడినట్లైతే ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది. అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

2.కలలో ఖాళీ గిన్నె

కలలో మీకు ఖాళీ గిన్నె కనపడినట్లైతే లక్ష్మీదేవి త్వరలో రాబోతోందని అర్థం. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. కలలో ఖాళీ గిన్నె కనపడితే డబ్బుకి లోటే ఉండదట. మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలో పూర్తయిపోతాయని సంకేతం.

3.కలలో గుడ్లగూబ

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గుడ్లగూబ కనపడితే చాలా మంచి జరుగుతుందట. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనపడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. సంతోషంగా జీవించు.

4.తెల్లటి మిఠాయిలు

తెల్లటి మిఠాయిలు కలలో కనపడితే కూడా సంతోషం కలుగుతుంది. ఈ కల వస్తే లక్ష్మీదేవి మీపై కాసుల వర్షం కురిపిస్తుందని, సంతోషంగా ఉండొచ్చని అర్ధం.

5.బంగారం, వెండి

కలలో బంగారం, వెండి వంటివి కనపడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా ప్రయోజనాలను పొందవచ్చు. సంతోషంగా జీవించొచ్చు. మీ కష్టాలకు తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని ఈ కల చెప్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం