Door Mat Vastu: ఇంట్లో డోర్‌ మ్యాట్ విషయంలో ఈ 7 వాస్తు నియమాలను పాటిస్తే, కాసుల వర్షమే!-door mat vastu tips follow these 7 remedies for wealth luck and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Door Mat Vastu: ఇంట్లో డోర్‌ మ్యాట్ విషయంలో ఈ 7 వాస్తు నియమాలను పాటిస్తే, కాసుల వర్షమే!

Door Mat Vastu: ఇంట్లో డోర్‌ మ్యాట్ విషయంలో ఈ 7 వాస్తు నియమాలను పాటిస్తే, కాసుల వర్షమే!

Peddinti Sravya HT Telugu

Door Mat Vastu: వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు నియమాలు తెలియక పాటించరు. ఇంట్లో డోర్‌ మ్యాట్ విషయంలో ఈ 7 వాస్తు నియమాలను పాటిస్తే చాలా లాభాలను పొందవచ్చు. మరి వాటి గురించి ఇప్పుడే తెలుసుకోండి.

డోర్‌ మ్యాట్ వాస్తు నియమాలు (pinterest)

వాస్తు నియమాలను పాటిస్తే, చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. వాస్తు నియమాల ప్రకారం నడుచుకుంటే, ఇంట్లో సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు నియమాలు తెలియక పాటించరు. కానీ నిజానికి ఈ మార్పు చేస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం దగ్గర ఉండే డోర్ మ్యాట్ విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. వీటిని కనుక పాటించినట్లయితే ప్రతికూల శక్తికి దూరంగా ఉండవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.

సరైన డోర్ మ్యాట్

  1. ఇంటి డోర్ మ్యాట్ విషయంలో కొన్ని నియమాలని పాటించడం వలన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు.
  2. ముఖద్వారం వద్ద ఉండే డోర్ మ్యాట్ విషయంలో పాటించాల్సిన నియమాలు
  3. ఎప్పుడూ కూడా డోర్ మ్యాట్ శుభ్రంగా ఉండాలి. ఇంటి ముఖద్వారం వద్ద ఉండే డోర్ మ్యాట్ దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండాలి.
  4. ఇంటి ముఖద్వారం ఉత్తరం వైపు ఉన్నట్లయితే నీలం రంగు డోర్ మ్యాట్ మంచిది. అలా ఉండడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
  5. అదే మీ ఇల్లు తూర్పు వైపు ఉన్నట్లయితే, లైట్ కలర్ డోర్ మ్యాట్ ని ఉపయోగించడం మంచిది. నలుపు నీలం డోర్ మ్యాట్ ని ఉపయోగించకూడదు.
  6. మీ ఇల్లు పడమర వైపు ఉన్నట్లయితే నీలం, ఆకుపచ్చ లేదా తెలుపు రంగు డోర్ మ్యాట్స్ ఉపయోగించడం మంచిది. ఇవి సానుకూల శక్తిని తీసుకువస్తాయి.
  7. ఇంటి ముఖద్వారం ఈశాన్యం వైపు ఉంటే ముదురు పసుపు లేదా లేత పసుపు రంగు డోర్ మ్యాట్లను ఉపయోగించడం మంచిది.

ఈ నియమాలని కూడా పాటించండి

  1. డోర్ మ్యాట్ సిల్క్, కాటన్ లేదా సహజమైన ఫైబర్ తో తయారు చేసినవి అయ్యి ఉంటే మంచిది. ఇవి సానుకూల శక్తిని కలిగించి, ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.
  2. అక్రిలిక్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన డోర్ మ్యాట్స్ ఉపయోగించడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని తొలగిస్తుంది. కనుక ఇటువంటివి ఉపయోగించద్దు.
  3. ఎప్పటికప్పుడు డోర్ మ్యాట్స్ ని శుభ్రం చేసుకుని మారుస్తూ ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం