GruhaPravesham Gifts:గృహ ప్రవేశాలకు వెళ్తున్నారా? అయితే పొరపాటుగా కూడా వీటిని బహుమతిగా తీసుకెళ్లకండి!-dont take these as gifts even by mistake to housewarmings know why ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gruhapravesham Gifts:గృహ ప్రవేశాలకు వెళ్తున్నారా? అయితే పొరపాటుగా కూడా వీటిని బహుమతిగా తీసుకెళ్లకండి!

GruhaPravesham Gifts:గృహ ప్రవేశాలకు వెళ్తున్నారా? అయితే పొరపాటుగా కూడా వీటిని బహుమతిగా తీసుకెళ్లకండి!

Ramya Sri Marka HT Telugu
Nov 16, 2024 08:25 AM IST

Gruha Pravesham Gifts: కార్తీకమాసం వచ్చిందంటే శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే. మీ స్నేహితులు, బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి మీకు వెళుతున్నారా. అయితే పొరపాటున కూడా బహుమతిగా వీటిని తీసుకెళ్లకండి.

గృహ ప్రవేశ వేడుక
గృహ ప్రవేశ వేడుక (pinterest)

కార్తీకమాసం వచ్చిందంటే శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. గత నాలుగు నెలలుగా శుభసమయాలు లేక ఆగిపోయిన గృహ ప్రవేశ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం వలంటి శుభకార్యాలన్నింటనీ నవంబర్ నుంచి నిస్సందేహంగా చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పటికే మీ బంధువులు, స్నేహితుల గృహప్రవేశ కార్యక్రమానికి మీకు ఆహ్వానం అందే ఉంటుంది. ఏం బహుమతి తీసుకుని వెళ్లాలా అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు కదా. గుర్తుంచుకోండి మీ ప్రియమైన వారి గృహప్రవేశానికి పొరపాటున కూడా ఈ బహుమతులు తీసుకెళ్లకండి. కొన్ని వస్తువులను ఇవ్వడం వల్ల మీ రెండు ఇళ్లు లేదా కుటుంబాలకు మధ్య ఉన్న ప్రేమానుబంధాలు తొలగిపోయి వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి.

ప్రపంచం సానుకూల శక్తులు, ప్రతికూలతో నిండి ఉంటుంది. మనం తెలియకుండా చేసే కొన్ని పనుల్లో ఉద్దేశం మంచిదైనప్పటికీ అవి ప్రతికూల శక్తులను ప్రేరిపిస్తాయి. ఫలితంగా మనతో పాటు మన చుట్టూ ఉండే వారు ఇబ్బందులకు గురవుతారు. అలాంటి విషయాల్లో ఒకటే ప్రియమైన వారికి కొన్ని వస్తువులను ఇవ్వడం. ఇలా చేయడం వల్ల బంధం బలపడుతుందని మనం నమ్ముతాం. కానీ కొన్ని సార్లు అలా జరగకపోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వారికి మీరు అశుభం తలపెట్టిన వారవుతారు. మీ రెండు కుటుంబాల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. వాస్త్రు ప్రకారం గృహప్రవేశాలకు బహుమతిగా ఇవ్వకూడని వస్తువులేంటో తెలుసుకుందాం.

1. కాంతి వస్తువులు

వాస్తు శాస్త్రం ప్రకారం, కత్తులు లేదా కత్తెర, బ్లేడు వంటి కాంతి వస్తువులు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ఇవి దురదృష్టానికి సంకేతంగా నిలుస్తాయి. వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగుతాయి. బంధాలు బలహీనంగా మారతాయి. ఇవి విభేదాలకు సంకేతంగా భావిస్తారు. బదులుగా ఐక్యత, సానుకూలతను పెంచే గిఫ్ట్‌లు ఇవ్వండి.

2. నలుపు రంగు వస్తువులు

నలుపు రంగు సాధారణంగా ప్రతికూల శక్తులతో సంబంధం కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నలుపు రంగు వస్తువులను ఇవ్వడం అనేది చీకటి, కాంతిహీనానికి సంకేతంగా భావిస్తారు. బదులుగా సజీవమైన, ఉత్సాహభరితమైన రంగులపై దృష్టి పెట్టండి. ఇవి సానుకూల శక్తిని తీసుకురావడంలో సహాయపడతాయి.

3. గడియారాలు

గడియారాలు ఇవ్వడం వాస్తు ప్రకారం చెడ్డ శకునం. ఎందుకంటే ఇవి సమయం గడిచిపోతున్నదనీ లేదా సమయం తక్కువ ఉందనీ సూచిస్తాయి. గడియారం ముగింపుకు సూచికగా నిలుస్తుంది. తద్వారా బంధం త్వరగా ముగిసిపోయే అవకాశాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

5. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు గిఫ్ట్‌గా ఇవ్వడం వాస్తు ప్రకారం అశుభ ఫలితాలను అందిస్తాయి. ఎందుకంటే ఇవి ఇంట్లో సహజ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ప్రశాంతను, శాంతియుత వాతావరణాన్ని పోగొట్టి ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తాయి.

6. అద్దం

మన చుట్టూ ఉండే శక్తులపై అద్దం గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. వాస్తు ప్రకారం వీటిని గృహప్రవేశాలకు బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువగా ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రతిబింబించవచ్చు. ఫలితంగా ఇంట్లో విభేదాలు ఏర్పడి చికాకు, అశాంతి వంటి సమస్యలు వస్తాయి.

7. అశుభకర కళా ప్రదర్శనలు

గృహప్రవేశానికి ఎక్కువ మంది శిల్పాలు, ఫొటో ఫ్రేములు వంటివి బహుమతులుగా ఇస్తుంటారు. అయితే వీటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రతికూల శక్తులను ప్రేరేపించేవి, విభేద భావనలు ఉన్న చిత్రాలు లేదా శిల్పాలను ఇవ్వకంటి. బదులుగా, ఆనందం మరియు శాంతిని ప్రేరేపించే కళలను ఎంచుకోండి.

Whats_app_banner