Home decor paintings: ఇంటిని అలంకరించుకోవడం కోసం ఇలాంటి పెయింటింగ్స్ పొరపాటున కూడా పెట్టుకోవద్దు
Home decor paintings: ఇంటికి అందంగా అలంకరించుకోవడం కూడా ఒక ఆర్ట్. అది ఒక వ్యక్తి అభిరుచిని తెలియజేస్తుంది. ఇంటిని డెకరేట్ చేసుకునేందుకు మంచి పెయింటింగ్స్, చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని మాత్రం అసలు పెట్టుకోకూడదు.
Home decor paintings: ఈరోజుల్లో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకునేందుకు అందరూ తాపత్రయపడుతున్నారు. అందుకోసం గోడలు బోసిగా ఉండకుండా ఉంచడం కోసం అందమైన పెయింటింగ్స్, వాల్ పేపర్స్ తగిలించుకుంటున్నారు.
ఇంటి అందాన్ని తీర్చిదిద్దడంలో పెయింటింగ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి గదికి మరింత అందాన్ని జోడిస్తాయి. ఆ ఇంట్లో ఉండే సభ్యుల వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడానికి ఇవి గొప్ప మార్గాలుగా చెబుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పెయింటింగ్స్ ఇంట్లో పొరపాటున కూడా పెట్టుకోకూడదు. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకువస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి పెయింటింగ్స్ ఇంట్లో ఉంచుకోకూడదో తెలుసుకుందాం. గృహాలంకరణ కోసం మీరు ఈ పెయింటింగ్స్ ని పొరపాటున కూడా తీసుకురావద్దు.
హింసాత్మక దృశ్యాలు
హింస, యుద్ధ సన్నివేశాలు లేదా పులులు, తోడేళ్లు వంటి క్రూర మృగాలను చిత్రీకరించే పెయింటింగ్ లకు దూరంగా ఉండాలి. ఈ చిత్రాలు ఇంట్లో సామరస్యాన్ని, శాంతికి భంగం కలిగిస్తాయని నమ్ముతారు.
దుఃఖం, బాధ వద్దు
విచారం, దుఃఖం లేదా బాధను చిత్రీకరించే కళాఖండాలు ఇంట్లో నిరాడంబరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇవి ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి .విషాద సంఘటనలను వర్ణించే పెయింటింగ్ లను నివారించండి.
విరిగిన పెయింటింగ్స్ వద్దు
విరిగిన భవనాలు, శిథిలమైన నిర్మాణాలకు సంబంధించిన పెయింటింగ్స్ పొరపాటున కూడా పెట్టుకోకూడదు. ఇవి క్షీణతను సూచిస్తాయి. వాస్తు ప్రకారం ఇటువంటి పెయింటింగ్స్ ఆర్థిక ఆస్తిరతను తీసుకువస్తాయని బలంగా విశ్వసిస్తారు.
విధ్వంసం ప్రకృతి వైపరీత్యాలు ఉంచకూడదు
వరదలు, భూకంపాలు లేదా మంటలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సూచించే పెయింటింగ్స్ అశుభమైనవిగా పరిగణిస్తారు. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించగలవు. భయం లేదా అనిశ్చితి భావాలను కుటుంబ సభ్యుల మనసులో నెలకొల్పుతాయి. అందుకే ఇలాంటి చిత్రపటాలు పొరపాటున కూడా పెట్టుకోవద్దు.
ఒంటరిగా ఉన్నవి వద్దు
ఒంటరిగా ఉన్న బొమ్మలు, ప్రకృతి దృశ్యాలు నిరాశకు సంబంధించిన వాటితో సంబంధం కలిగి ఉన్న కళాకృతులకు దూరంగా ఉండాలి. ఈ పెయింటింగ్స్ ఒంటరితనం, విచార భావాలను ఎక్కువగా తీసుకువస్తాయి.
డార్క్ ఆర్ట్ వర్క్ వద్దు
ముదురు రంగులు, దిగులుగా ఉండే థీమ్స్, నలుపు ఎక్కువగా ఉండే పెయింటింగ్స్ ను తక్కువగా ఉపయోగించాలి. ఇటువంటి కళాకృతులు పరిసరాల నుండి సానుకూల శక్తిని హరిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వక్రీకరించిన చిత్రాలు వద్దు
ఎవరినైనా హేళన చేసేటట్లుగా ఉన్నా వక్రీకరించిన పెయింటింగ్స్ నివారించాలి. దృశ్యపరంగా అశాంతి కలిగించడం లేదా సామరస్యం లేని చిత్రాలు ఇంట్లో శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి.
నెగిటివ్ థీమ్ వద్దు
నెగటివిటీని వ్యక్తపరిచే అద్దాలు, కాకులు, గుడ్లగూబలు వంటి చిహ్నాలు అనేక సంస్కృతులలో అశుభమైనవిగా పరిగణిస్తారు. అందుకే వాటికి దూరంగా ఉండాలి.
ఈ పెయింటింగ్స్ కి బదులుగా సానుకూలత, శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే కళాకృతులు ఎంచుకోవచ్చు. ప్రకాశంవంతమైన రంగులు, ఉత్తేజకరమైన థీమ్‌తో కూడిన పువ్వులు, పక్షులు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన శుభ చిహ్నాలతో కూడిన పెయింటింగ్స్ ఎంచుకోవచ్చు. ఇవి మీ ఇంటి అలంకరణకు చక్కగా నప్పుతాయి. అలాగే వాస్తు అనుకూలమైన పెయింటింగ్స్ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసారిస్తుంది. సమతుల్యత, సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్