Banana leaf: అరిటాకులో భోజనం చేస్తే జాతకంలో గ్రహాలు బలపడతాయా? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి?
Banana leaf: అరటి ఆకులో భోజనం చేయడం చాలా మందికి ఇష్టం. దక్షిణ భారతీయులు అరిటాకులో వడ్డించేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంట్లో తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు జాతకంలోని గ్రహాల స్థానాలు కూడా బలపడతాయంట. అవి ఏ గ్రహాలో చూద్దాం.
అరిటాకులో అన్నం తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. వివిధ మత ఆచారాలలో వీటిని వినియోగిస్తున్నారు. వివాహాలలో భోజనాన్ని అరిటాకులోనే వడ్డిస్తున్నారు. అరటి ఆకుతో జ్యోతిష్యం, వైద్య పరంగా చాలా లాభాలు ఉన్నాయని చెబుతారు. అయితే అరిటాకులో తినడం వల్ల జాతకంలోని గ్రహాలు కూడా బలపడతాయని మీకు తెలుసా?
నవగ్రహాలలో కొన్నింటికి అరిటాకుతో సంబంధం ఉందని అంటారు. అరటి ఆకులు ఎందుకు అంత పవిత్రమైనవిగా మారాయి అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. అది ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.
అరటి చెట్టు అందుకే పవిత్రమైనది
పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి అనగానే ముక్కు మీద కోపం అనేసి చెప్తారు. ఒకనాడు దుర్వాస మహర్షి నిద్రపోతున్నప్పుడు అతని భార్య ఇబ్బంది పెట్టిందట. విసుగు చెందిన మహర్షి తన భార్యను అరటి చెట్టుగా మారమని శపించారు. అప్పుడు తనని పవిత్రమైన వృక్షంగా పూజించమని చివరి కోరికగా భర్తను అభ్యర్థించింది. దుర్వాస మహర్షి తన భార్య చివరి కోరికను తీర్చాడు. అప్పటి నుంచి ప్రజలు అరటి చెట్టును పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు.
గ్రహాలు బలపడతాయి
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని అంటారు. ఇవి పవిత్రమైన జీవితానికి సానుకూలతను తీసుకొస్తాయి. ఇది మాత్రమే కాదు అరటి ఆకు నవగ్రహాలలో కొన్ని గ్రహాలతో ముడి పడి ఉంటుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుడు, బృహస్పతితో అరటి చెట్టుకు అనుబంధం ఉందని చెబుతారు. ఇక దీని పసుపు రంగు బృహస్పతికి సంబంధించినదిగా చెప్తారు. అరటి పండు కుజుడికి సంబంధం ఉందని అంటారు. అలాగే ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
అరటి ఆకుల్లో తినడం వల్ల గ్రహదోషాలను దూరం చేసుకోవచ్చని అంటారు. గురువారం రోజు అరటి చెట్టుకు నీరు పోయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే అరటి పండ్లు ఇతరులకు దానం చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం అరటి ఆకులు రూపం, అందులోని రేఖలు మనిషి అరచేతులను పోలి ఉంటాయి. అరటిపండులో గింజలు చాలా తక్కువగా ఉంటాయి అంటే ఆత్మ కర్మరహితమని చూపిస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగానే కాకుండా శాస్త్రీయపరంగా కూడా అరటి ఆకులు అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. వీటిలో అన్నం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆచారాలలో అరటి ఆకుల వినియోగం
దక్షిణ భారతీయ ఆచార్య వ్యవహాలలో అరటి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. తీసుకొస్తాయని నమ్ముతారు. వీటిలో నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేస్తారు. కొన్ని ప్రాంతాలలో వంట చేసేందుకు అరటి ఆకులను ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలు అందులో పెట్టి అరటి ఆకుతో చుట్టి చేస్తారు. ఈ ఆకుల మీదే దేవత మూర్తులు ప్రసాదం స్వీకరిస్తారని అంటారు. ఇది మాత్రమే కాదు అరటి చెట్టు వినాయకుడి భార్య అని బెంగాలీలు నమ్ముతారు. శ్రీమహావిష్ణువు ఈ వృక్షంలో లక్ష్మీ సమేతంగా నివాసం ఉంటాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇది పవిత్రమైన చెట్టుగా మారిందని నిత్యం పూజలు జరిపిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్