Maha bharatam: మీరు మహాభారతం చదివారా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం
Maha bharatam: మహాభారతం అద్భుతమైన కావ్యం. ఇంట్లో పెద్దవాళ్ళు మహాభారతం చదువుతూ ఉంటారు. మనం కూడా చిన్నప్పటి నుంచి దీనికి సంబంధించి ఎన్నో కథలు వింటూనే ఉంటాం. మీరు మహాభారతం చదివారా? అయితే ఈ సింపుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
భారతీయ ఇతిహాసాలలో అత్యంత ముఖ్యమైనది, అద్భుతమైన మహాకావ్యం మహాభారతం. ఎన్నిసార్లు చదివినా చదవాలనిపిస్తుంది. చదివిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. జీవిత సత్యాలను నేర్పిస్తుంది. అందుకే తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి అంటారు.
మనలో చాలామంది మహాభారతం గురించి కథలు కథలుగా వింటూనే ఉంటారు. కర్ణుడు, అర్జునుడు వంటి మహా యోధులు, ద్రోణాచార్య వంటి ఉత్తమ గురువు, భీముడు, భీష్ముడు వంటి పురుషులు, శకుని వంటి దుర్మార్గులు ఉన్నారు. అన్యాయ మార్గంలో పయనిస్తే చివరికి లభించేది మరణమే అనే విషయం భారతం నిరూపించింది. నిజాయితీకి ఎప్పటికైనా మంచే జరుగుతుందని పాండవులు నిరూపించారు. కుట్రలు, కుతంత్రాల వల్ల లభించేది తాత్కాలిక ఆనందమనే విషయం శకుని ద్వారా తెలుస్తుంది. మీరు మహాభారతాన్ని ఎక్కువగా చదివారా? ఇతిహాసం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుందా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు మహా భారతం గురించి ఎంత తెలుసు అనేది ఒక అవగాహన వస్తుంది.
1. తన రథంపై అర్జునుడి ధ్వజంలో ఏ దేవుడు భాగం అయ్యాడు?
2. కౌరవుల పక్షాన పోరాడకుండా యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక కౌరవుడు ఎవరు?
3. పాండవులు కౌరవులు ఇద్దరికీ యుద్ధంలో శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు?
4. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?
5. మహాభారతాన్ని రాజు జనమేజయుడికి ఎవరు చెప్పారు?
6. చక్రవర్తిగా స్థిరపడేందుకు రాజు సూరయజ్ఞాన్ని ఎవరు నిర్వహించారు?
7. ఒక క్లిష్టమైన యుద్ధంలో కర్ణుడు తన దివ్య మంత్రాలను మరిచిపోతాడని ఊహించి శపించిన మహర్షి ఎవరు?
8. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శివుడు బహుమతిగా ఇచ్చిన ఆయుధం ఏది?
ఇందులో మీకు ఎన్ని సమాధానాలు తెలుసు. అన్నింటికీ సమాధానాలు చెప్పగలిగారంటే మీకు మహాభారతం మీద మంచి పట్టు ఉన్నట్టే అర్థం. ఇక తెలియని వాళ్ళ కోసం ఇక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాము వాటిని పరిశీలించండి.
1. హనుమంతుడు అర్జునుడు రథ ధ్వజంపై ఉన్నాడు.
2. నూరు మంది కౌరవులలో యుయుత్సుడు మాత్రమే అన్నదమ్ముల తరఫున పోరాడకుండా పాండవుల పక్షాన పోరాడాడు. వంద మంది కౌరవులలో జీవించి ఉన్న ఒకే ఒక్కడు ఇతడే. యుద్ధం అనంతరం కౌరవ సామ్రాజ్యాన్ని పాండవులు ఇతడికే అప్పగించారు.
3. ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ గురువుగా వ్యవహరించాడు.
4. పాండవులు కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో కౌరవులను పాండవులు ఓడించారు.
5. వైశంపాయన మహర్షి రాజు జనమేజయుడికి మహాభారతం గురించి చెప్పాడు.
6. యుధిష్టురుడు రాజసూయ యజ్ఞం చేశాడు.
7. పరశురాముడు కర్ణుని దివ్య మంత్రాలను మరిచిపోతాడని శపించాడు.
8. మహాభారత యుద్ధానికి ముందు శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్