మరణం తర్వాత ఏం జరుగుతుంది, పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా?-do you know what happens after death and why we should do pinda pradhanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మరణం తర్వాత ఏం జరుగుతుంది, పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా?

మరణం తర్వాత ఏం జరుగుతుంది, పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu

పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి. అయితే మరణం తర్వాత ఏం జరుగుతుంది, పిండ ప్రదానాలు ఎందుకు చేయాలి వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మరణం తర్వాత ఏం జరుగుతుంది, పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా? (pinterest)

మరణం తరువాత ఏం జరుగుతుంది? అసలు పిండ ప్రదానాలు ఎందుకు? ఈ అంశాలను స్పష్టంగా వివరించేదే 'పిండోపనిషత్తు'. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

అధర్వణ వేద శాఖకు చెందిన ఉపనిషత్ పిండోపనిషత్తు. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్య, నైమిత్తిక, కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. మరణం తరువాత అంశాన్ని మాత్రం మనం తెలుసుకుంటే, పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలు విడిపోవడమే మరణం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచభూతాలు వచ్చినట్టే వెళ్లిపోతాయి

శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహా భూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవో అలానే వెళ్లిపోతాయి. దీనిని ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు.

ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం), దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది, శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది.

ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో, భూతతత్త్వం అయిన ధాతువులు, ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మహాకాశంలో కలిసిపోతుంది

మరణం తరువాత శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే.. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం అని చిలకమర్తి తెలిపారు. మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అనే రెండూ ఉంటాయి.

కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాప పుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దారిన అవి వెళ్ళిపోతే, చివరకు మృతుని ప్రేత మాత్రం మిగిలి ఉంటుంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పిండ ప్రదానాలు ఎందుకు చేయాలో తెలుసా?

ప్రతీ మానవుడు ధర్మ మార్గంలో నడుస్తూ కర్మను ఆచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందాలి. అయితే, కర్మలను ఆచరించే విధానంలో అందరూ జ్ఞానము ద్వారా మోక్షము పొందలేని స్థితి ఏర్పాటు చేత కర్మలో పితృ దేవతలను తృప్తి పరిచి, పిండ ప్రదానాలు ఆచరించడం చేత పితృ దేవతల అనుగ్రహం పొంది నిత్య జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అని చిలకమర్తి తెలిపారు.

పితృ దేవతలకు పిండ ప్రదానాలు ఆచరిస్తే ఆయుష్షు, ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుందని, ఇహలోకంలో భోగ భాగ్యములు కలుగుతాయని చిలకమర్తి తెలిపేరు. ప్రతీ మానవుడు దేవతలను పూజించడం ఎంత ముఖ్యమో పితృ దేవతులకు పిండ ప్రదానం చేయడం, వారు గతించిన తిధి నాడు పిండ ప్రదానం చేయడం వలన కొన్ని రెట్లు శుభ ఫలితాలను పొందవచ్చు అని చిలకమర్తి తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.