జ్యేష్ఠ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ మాసంలో వచ్చే పండుగలు, పౌరాణిక విశేషాలు తెలుసుకోండి!-do you know the significance of jyeshta masam check festivals and important things about this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జ్యేష్ఠ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ మాసంలో వచ్చే పండుగలు, పౌరాణిక విశేషాలు తెలుసుకోండి!

జ్యేష్ఠ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ మాసంలో వచ్చే పండుగలు, పౌరాణిక విశేషాలు తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

జ్యేష్ఠ మాసం హిందూ పంచాంగ ప్రకారం, చైత్ర మాసంతో ప్రారంభమయ్యే సంవత్సరంలో మూడవ మాసం. ఇది సాధారణంగా మే, జూన్ నెలల్లో వస్తుంది. ఈ మాసాన్ని జ్యేష్ఠం అని పిలుస్తారు. జ్యేష్ఠ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ మాసంలో వచ్చే పండుగలు, పౌరాణిక విశేషాలు తెలుసుకోండి.

జ్యేష్ఠ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? (Pixabay)

బ్రహ్మదేవుడి ఆరాధనకూ, విష్ణు సహస్రనామ పఠనకూ, ఏకాదశి పూజలకూ అనుకూలమైన మాసం జ్యేష్ఠం. దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం ఉండే మాసం జ్యేష్ఠం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మే, జూన్ నెలల్లో

జ్యేష్ఠ మాసం హిందూ పంచాంగ ప్రకారం, చైత్ర మాసంతో ప్రారంభమయ్యే సంవత్సరంలో మూడవ మాసం. ఇది సాధారణంగా మే, జూన్ నెలల్లో వస్తుంది. ఈ మాసాన్ని జ్యేష్ఠం అని పిలుస్తారు. ఈ మాసంలో వేడిగా, ఎండగా ఉండే కాలం కావడంతో దీనిని గ్రీష్మ ఋతువు అని కూడా అంటారు.

ఈ సమయంలో సూర్యుడి తాపం ఎక్కువగా ఉండి, ప్రకృతిలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసంలో నదులు, బావులు, కాలువలకు పూజలు చేస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మ దేవుడికి ఇష్టమైన మాసం

పురాణాల ప్రకారం, జ్యేష్ఠం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ నెలలో తనని ఆరాధించినవారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడనీ, ఐశ్వర్యంతో పాటు ఆనందాన్నీ ప్రసాదిస్తాడనీ అంటారు. అదే సమయంలో విష్ణు సహస్రనామాలనూ పఠిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

జ్యేష్ఠా అనే పేరు ఎలా వచ్చింది?

పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఇది తెలుగు మాసాల్లో మూడోది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీరాముడు జ్యేష్ఠ మాసంలోనే హనుమంతుడిని కలిశాడట. ఇక ‘నిర్జల ఏకాదశి’గా పిలిచే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి, నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేయాలంటారు పెద్దలు. దీనివల్ల 12 ఏకాదశి తిథుల్లో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది.

మహాజ్యేష్ఠ

ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ‘మహాజ్యేష్ఠ’ అని పేరు. దీన్నే ‘ఏరువాక పున్నమి’గా వ్యవహరిస్తారు. ఇది రైతుల పండుగ. ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి, అలంకరించి, నైవేద్యం నివేదించి, ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు రైతులు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దశ పాపహర దశమి

ఇక జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని ‘దశ పాపహర దశమి’గా పిలుస్తారు. అంటే పదిరకాల పాపాలను పోగొట్టే రోజని అర్థం. గంగా దేవి అవతరించిన రోజూ ఇదే. అందుకే ఉత్తరాదిన ‘దశహర గంగోత్సవం’ పేరుతో గంగమ్మను ఆరాధిస్తారు.

అలాగే, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం తదితరాలను గంగాదేవికి సమర్పిస్తే మంచిదని నమ్ముతారు. వీటన్నింటితోపాటు, ఈ నెలలో చెప్పులు, గొడుగు, ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని చెబుతున్నాయి శాస్త్రాలు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ : 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.