పూరీలో రథయాత్ర చేస్తారన్న విషయం మనకు తెలుసు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో పూరీ జగన్నాథుని భక్తులు రథయాత్రకు పెద్ద సంఖ్యలో వెళతారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో రథయాత్రను వీక్షిస్తారు. ఈ రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అయితే, పూరీలో రథయాత్ర జరుగుతుందన్న విషయం మనకు తెలుసు.
కానీ పూరీతో పాటు చాలా చోట్ల రథయాత్రను నిర్వహిస్తారు. మరి పూరిలోనే కాకుండా రథయాత్రను ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి మొదలవుతుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రంలో ఈ రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాడమాసం శుక్లపక్షం రెండవ రోజు నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. కృష్ణ భక్తులు విదేశాల నుంచి కూడా వస్తారు. అయితే, పూరీతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడే తెలుసుకుందాం:
పూరీలో రథయాత్ర జరిపినట్లే రాంచీలో కూడా జరుపుతారు. రథయాత్రను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ జగన్నాథుడు రథంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తాడు. డప్పులు, సన్నాయి, వాయిద్యాలతో రథయాత్రను ఘనంగా జరుపుతారు.
హైదరాబాదులో కూడా పూరీ తరహాలోనే పాదయాత్రను జరుపుతారు. బంజారాహిల్స్‌లో ఉన్న జగన్నాథ ఆలయంలో కూడా ఈ సంప్రదాయం ఉంది. జగన్నాథుడు, సుభద్రా దేవి, బలభద్రుడు మూడు రథాల్లో ఉంటారు. రథాలను అందంగా అలంకరించి ఊరేగిస్తారు.
భోపాల్ నగరంలో కూడా ఈ రథయాత్రను ఘనంగా జరుపుతారు. ఇక్కడకి కూడా భారీగా భక్తులు వస్తారు. ఈ రథయాత్రను వైభవంగా జరుపుతారు.
కాశీలో కూడా జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు. ఇక్కడికి కూడా చాలామంది భక్తులు తరలివస్తారు. ఘనంగా జరిపే ఈ రథయాత్రకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు.
ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో కూడా రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జగన్నాథుడు రథంలో ఊరేగుతూ ఉంటే భక్తుల సంతోషానికి అవధులే ఉండవు.
బృందావనంలో కూడా పూరీ మాదిరిగా రథయాత్రను నిర్వహిస్తారు. చాలామంది భక్తులు ఇక్కడ రథయాత్రకు వెళ్తారు. భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి రథయాత్రను చూడడానికి వస్తారు.
ఢిల్లీలో జగన్నాథ ఆలయంలో కూడా రథయాత్రను నిర్వహిస్తారు. హౌజ్ కాస్ట్‌లో ఉన్న ఈ ఆలయం, జగన్నాథుని రథయాత్రను నిర్వహించే సాంప్రదాయం కలిగి ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.