Tulasi Plant vasthu tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెంచవచ్చో తెలుసా?-do you know how many tulsi plants can be grown at home according to vastu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Do You Know How Many Tulsi Plants Can Be Grown At Home According To Vastu?

Tulasi Plant vasthu tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెంచవచ్చో తెలుసా?

Haritha Chappa HT Telugu
Dec 07, 2023 12:15 PM IST

Tulasi Plant vasthu tips: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ఒక పవిత్రమైన మొక్క.

తులసి మొక్క
తులసి మొక్క

Tulasi Plant vasthu tips: ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండడం ఆనవాయితీగా మారింది. ఇది ఒక పవిత్రమైన మొక్కగా హిందూ సంప్రదాయంలో స్థానాన్ని సంపాదించింది. ఆయుర్వేదంలో ఇది అద్భుతమైన మూలిక కూడా. తులసి మొక్క అనేది సానుకూలతకు, సామరస్యానికి చిహ్నంగా చెబుతారు. శాంతియుత వాతావరణాన్ని ఇది కలిగిస్తుందని అంటారు. ఇంట్లో తులసి మొక్కను కలిగి ఉంటే ఆ ఇల్లు భోగభాగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్కను ఒక మతపరమైన చిహ్నంగా చూస్తారు.

ట్రెండింగ్ వార్తలు

తులసి మొక్కతో ఆక్సిజన్...

తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర కాలుష్య కారకాలను గ్రహిస్తుంది. సహజమైన పద్ధతిలో గాలిని శుద్ధి చేస్తుంది. నిరంతరం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. తులసి మొక్కలు ఎక్కువగా ఉన్నచోట ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ప్రాంతమంతా ఆరోగ్యకరమైన నివాస స్థలంగా చెప్పవచ్చు.

తులసి వాస్తు

వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఈ మొక్కకు తగినంత సూర్యరశ్మి అందాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ మొక్క ఆరోగ్యంగా ఉండగలదు. దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కష్టాలు, అవరోధాలు ఎక్కువవుతాయి. తులసి మొక్కను భక్తితో పూజించాలి. దానికి దగ్గరలో చీపుర్లు, డస్ట్ బిన్లు, చెప్పులు వంటివి ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఆ మొక్క పవిత్రతను తగ్గించిన వారు అవుతారు. అలాగే తులసి మొక్క ఇంటి పునాది కంటే ఎత్తులో ఉంచడం చాలా ముఖ్యం. అలా ఉంచడం వల్ల వాస్తు పరంగా శుభప్రదం. అలాగే ఎండిపోయిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. ఎప్పుడైతే తులసి మొక్క ఎండిపోయినట్టు అయితే అవి దురదృష్టాన్ని తెస్తుందని అంటారు. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి ఎండిపోయిన తులసి మొక్కను తీసి కొత్త మొక్కతో భర్తీ చేయాలి. తులసి మొక్క ఎండి పోతే దాన్ని పవిత్ర నదుల్లో లేదా నీటిలో కలిపేయడం మంచిది.

ఇంట్లో సానుకూల ఫలితాలు వచ్చేలా చూడడం కోసం తులసి మొక్కలను ఒక లెక్క ప్రకారమే ఇంట్లో పెంచాలి. ఒక మొక్కను పెంచవచ్చు లేదా మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలోనే తులసి మొక్కలను ఇంట్లో పెంచాలని వాస్తు చెబుతోంది. వాస్తు చెబుతున్న ప్రకారం తులసి మొక్కను ఈశాన్యం వైపు ఉంచితే ఎంతో మంచిది. దానికి సూర్యరశ్మి తగిలేలా ఉండడం మాత్రం చాలా ముఖ్యం.

తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న చోట నివసించే వారిలో క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. తులసి మొక్క ఉన్నచోట దోమలు ఉండలేవు. ఆ పరిసరాలన్నీ ఆహ్లాదంగా, తాజాగా ఉంటాయి. తులసి మొక్క చుట్టూ పువ్వులు పూసే మొక్కలను ఉంచండి. ఇది ఇంటికి మంచిది. హిందూ విశ్వాసాలు చెబుతున్న ప్రకారం కార్తీకమాసంలో గురువారం పూట కొత్త తులసి మొక్కను నాటితే మంచిది.

మానసిక ఆందోళనగా, ఒత్తిడిగా అనిపిస్తున్నప్పుడు తులసి ఆకులను వాసన చూస్తే ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే ప్రతిరోజూ ఆ మొక్కకు కుంకుమ పెట్టి పసుపు చల్లి, పువ్వులు, ధూప దీపాలను సమర్పించడం చాలా ముఖ్యం. తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని పెడితే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.

కొత్త తులసి మొక్కను నాటడం అశుభం. ఎందుకంటే శనిగ్రహం శనివారంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ రోజు తులసి మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది.

తులసి మొక్కను పూజించడానికి నీరు, పాలు, తేనె వంటివి పోయవచ్చు. అలా పోస్తూ ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సానుకూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.