Dev Uthani Ekadashi: మీ పాపాలన్నీ తొలగిపోవాలా.. అయితే రేపటి దేవుత్తాని ఏకాదశి రోజు ఈ ఆరు పనులు చేయండి-do these things on devutthana ekadashi day all your sins should be removed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dev Uthani Ekadashi: మీ పాపాలన్నీ తొలగిపోవాలా.. అయితే రేపటి దేవుత్తాని ఏకాదశి రోజు ఈ ఆరు పనులు చేయండి

Dev Uthani Ekadashi: మీ పాపాలన్నీ తొలగిపోవాలా.. అయితే రేపటి దేవుత్తాని ఏకాదశి రోజు ఈ ఆరు పనులు చేయండి

Ramya Sri Marka HT Telugu
Nov 11, 2024 08:10 PM IST

Dev Uthani Ekadashi: దేవుత్తాని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సారి నవంబర్ 12 న జరుపుకుంటున్న దేవుత్తాని ఏకాదశి రోజున ఉపవాసంతో పాటు కొన్ని పరిహారాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి.

దేవుత్తాన ఏకాదశి పరిహారాలు
దేవుత్తాన ఏకాదశి పరిహారాలు (Shutterstock)

ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షంలో దేవుత్తాని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. ఇదే రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు కూడా కలుగుతాయని విశ్వాసం. ఇంతకీ దేవుత్తాని ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో ముందు తెలుసుకుందాం.

తొలి ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రలోనే గడిపిన తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కోంటాడు. దీన్నే దేవుత్తాని ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి, విష్ణు పూజ చేస్తే అఖండ సంపద లభిస్తుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇదే రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తులసి దేవికి వివాహం కూడా జరిపిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ దేవి కటాక్షం కూడా కలుగుతుందని చెబుతుంటారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన దేవుత్తాని ఏకాదశి నాడు ఉపవాసంతో పాటు చేయవలసిన పరిహారాలు కొన్ని ఉన్నాయి.

దేవుత్తాని ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు?

ద్రిక్ పంచాంగం ప్రకారం.. దేవుత్తాని ఏకాదశి నవంబర్ 11, 2024న సాయంత్రం 06:46 గంటలకు ప్రారంభమై నవంబర్ 12న మరుసటి రోజు సాయంత్రం 04:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం దేవుత్తాని ఏకాదశి నవంబర్‌ 12 జరుపుకుంటారు.

దేవుత్తాని ఏకాదశి రోజున చేయవలసిన పరిహారాలు:

  1. దేవుత్తాని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల వృత్తిపరంగా మీకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయి, మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

2. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, విడిపోయే వరకూ వచ్చిన దంపతులు కూడా ఈ దేవుత్తాని ఏకాదశి రోజున తులసి మాతా, విష్ణుమూర్తిని పూజిస్తే చాలు. దంపతులు ఇద్దరూ కలిసి వీరిని ఆరాధిస్తే ఇద్దరి మధ్య ఉన్న బేధాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున లక్ష్మీదేవికీ, తులసి మాతకు అలంకరణ వస్తువులను సమర్పిస్తే శాంతి, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

3. దేవుత్తాని ఏకాదశి నాడు దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. జీవితంలోని అన్ని కష్టాలను అధిగమించడానికి ఈ ఏకాదశి రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి ఆహారం, బట్టలు వంటి దానంగా ఇవ్వాలి.

4. దేవుత్తాని ఏకాదశి నాడు భాగవతాన్ని పఠించడం కూడా పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు.

5. మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే దేవుత్తని ఏకాదశి రోజున, బ్రహ్మ ముహూర్తంలో విష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఒక తమలపాకులో ఓం విష్ణువే నమః అని రాసి భగవంతుని పాదాల వద్ద సమర్పించండి. మరుసటి రోజు, ఈ ఆకును పసుపు వస్త్రంలో చుట్టి భద్రంగా దాచి ఉంచండి.

6. దేవుత్తాని ఏకాదశి రోజున రావిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు.

నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వాటిని స్వీకరించే ముందు సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

Whats_app_banner