Karthika Purnima: కార్తీక పౌర్ణమి రోజు ఈ పరిహారాలు చేశారంటే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయం-do these remedies on karthika purnima to attract goddess lakhsmi to your house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Purnima: కార్తీక పౌర్ణమి రోజు ఈ పరిహారాలు చేశారంటే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయం

Karthika Purnima: కార్తీక పౌర్ణమి రోజు ఈ పరిహారాలు చేశారంటే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడం ఖాయం

Ramya Sri Marka HT Telugu
Nov 14, 2024 10:41 AM IST

Karthika Purnima: కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, చంద్రుడు, లక్ష్మీ దేవతను పూజిస్తే శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని నమ్మిక.

లక్ష్మీ దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి
లక్ష్మీ దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇలా చేయండి

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ఈ రోజున చేసే వ్రతాలు, పూజలను దేవతలు స్వయంగా స్వీకరిస్తారని భావిస్తారు. దేవతలందరినీ ఇబ్బంది పెడుతున్న త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి రోజున సంహరిస్తడు. త్రిపురాసురిడి పీడ విరగడైందన్న సంతోషంతో దేవతలంతా కలిసి దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. దీన్నే దేవ్ దీపావళి లేదా దేవతల దీపావళి అని పిలుస్తారు. అప్పటి నుంచి ప్రతి కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాారి 15 నవంబర్ 2024 శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది.

పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున దీపావళి జరుపుకునేందుకు దేవతలందరూ కాశీకి వస్తారు. ఈ పండగను వారణాసీలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు దీపాలు వెలిగించడం, గంగలో విడిచిపెట్టడం శుభప్రదమని అగ్ని పురాణం చెబుతుంది. కనుక చాలా మంది భక్తులు పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగించి దేవుళ్లను ఆరాధిస్తరు. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర గంగా స్నానాలకు కూడా ప్రాముఖ్యత ఎక్కువ.

కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజకు కూడా విశిష్టత ఎక్కువ. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూర్ణిమ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి అత్యంత సంతోషంగా ఉంటుందనీ, ఆమెను భక్తి శ్రద్దలతో పూజించి ప్రసస్నం చేసుకుంటే భక్తులు కోరుకున్న వరాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కొన్ని పరిహారాలను చేయడం వల్ల లక్ష్మీ దేవి మెచ్చి భక్తుల ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుటుంది. కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పరిహారాలేంటో తెలుసుకోండి.

  1. కార్తీకపౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఈ రోజున సత్యనారయణ స్వామి వ్రత కథను పఠించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి తమ భక్తులను ఆశీర్వదిస్తుంది. జీవితాన్ని ఆర్థిక శ్రేయస్సుతో నింపుతుందని విశ్వాసం.
  2. హిందూ సంప్రదాయం ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు నివసించి ఉంటారు. ఈ చెట్టును పూజించడం వల్ల చాలా రకాల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టును పాలు పోయడం వల్ల శుభఫలితాలు దక్కుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నమై సంతోషం, ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయిని నమ్ముతారు.
  3. పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు హిందువులు. కార్తీకపౌర్ణమి రోజున పసుపు గోధుమలను లక్ష్మీ దేవికి సమర్పించడం శుభఫలితాలను ఇస్తుంది. తర్వాత వాటిని తీసి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకని కూర్చుంటుందని నమ్మిక.
  4. కార్తీకపౌర్ణమి రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేయవలసిన ముఖ్యమైన పనేంటంటే.. బ్రహ్మ ముహూర్తంలో గంగానదిలో స్నానం చేయడం. తర్వాత శివాలయానికి వెళ్లి మహా మృత్యుంజయ సంపుటి మంత్రాన్ని పఠించడం. ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల్లో విజయం లభిస్తుంది. శత్రువులకు ఓటమి తప్పదు. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరతాయి.
  5. లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే కార్తీకపౌర్ణమి రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున లక్ష్మీ దేవి సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దేవతల ఆశీర్వాదం లభించి భక్తుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో కోరిన కోరికలన్నీ తీరతాయని నమ్ముతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner