Hanuman jayanti 2024: శని దోషం నుంచి విముక్తి కలిగేందుకు హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి-do these remedies on hanuman jayanti to get rid of shani dosham ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Jayanti 2024: శని దోషం నుంచి విముక్తి కలిగేందుకు హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి

Hanuman jayanti 2024: శని దోషం నుంచి విముక్తి కలిగేందుకు హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు కొన్ని సింపుల్ పరిహారాలు పాటించడం వల్ల శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఈ నివారణలు పాటించాలి.

హనుమాన్ జయంతి పరిహారాలు (pexels)

Hanuman jayanti 2024: సాధారణంగా ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హిందూమతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున భజరంగబలిని పూజిస్తారు.

ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉండనుంది. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజునే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది. దీంతో హనుమాన్ జయంతి ప్రత్యేకత రెట్టింపు అయ్యింది.

హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడి భక్తులు ఈరోజు ఉపవాసం పాటిస్తారు. ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలోని అన్ని బాధలు, సంక్షోభాలు తొలగిపోతాయని విశ్వాసం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి వచ్చింది. దీన్ని కొందరు హనుమాన్ జన్మోత్సవ్ గా కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు తీసుకుంటే మంచిది. హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్ రెమెడీస్ పాటించారంటే మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల భూత, ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి.

శని దోషం పోగొట్టేందుకు

హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఆరాధించాలి. ఆంజనేయస్వామి ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు ఒకరు. అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా పొందినట్టే. శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది.

రుణ బాధల నుంచి బయట పడేందుకు

హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయట పడతారు. ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయి.

ఆర్థిక సంక్షోభం తొలగించేందుకు

ఆర్థిక సంక్షోభం తొలగించుకునేందుకు హనుమాన్ జయంతి రోజు మీ భక్తికి అనుగుణంగా దానధర్మాలు చేయాలి. ఈ రోజున పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి.

సుందరకాండ పారాయణం

హనుమంతుడికి సంబంధించిన సుందరకాండను హనుమాన్ జయంతి రోజు పారాయణం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే ఈరోజు హనుమంతుడికి లడ్డూలు సమర్పించాలి. ఈ లడ్డులను కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే ఇతరులకు దీన్ని పంచి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

తమలపాకుల దండ

తమలపాకులు అంటే హనుమంతుడికి మహా ఇష్టం. వాటి మీద జైశ్రీరామ్ అని రాశి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి.