విష్ణుమూర్తిని పూజించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి, సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు. విష్ణువు, గురువుని పూజించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
జీవితంలో అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. గురువారం ఎటువంటి పరిహారాలని పాటిస్తే మంచిదో ఇప్పుడే తెలుసుకుందాం. గురువారం నాడు ఈ పరిహారాలు పాటిస్తే మేధో శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.
గురువారం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. గురువుని ధ్యానించండి. మంత్రాలని పఠించండి.' ఓం ఐం క్లీం బృహస్పతియే నమః' మంత్రాన్ని 21 సార్లు జపించడం వలన జ్ఞానం, మేధో సామర్థ్యం పెరుగుతాయి.
వ్యాపారంలో లాభాలు రావాలంటే గురువారం నాడు పూజ సమయంలో విష్ణుమూర్తికి గంధం సమర్పించాలి. ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించాలి. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా పుంజుకుంటుంది.
మీ పిల్లలు మీ మాట వినకుండా పదేపదే ఇబ్బంది పెడుతున్నట్లయితే, ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని మీ పిల్లల చేత ముట్టించి, ఆ తర్వాత దీనిని విష్ణుమూర్తికి సమర్పించండి. 'ఓం ఐం క్లీం బృహస్పతియే నమః' మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ పిల్లలు సరైన త్రోవలో వెళ్తారు.
పెద్దవాళ్లతో సఖ్యత కలగాలన్నా, ప్రేమానురాగాలు పెరగాలన్నా గురువారం నాడు మహావిష్ణువుని ఆరాధించండి. మామిడిపండ్ల రసాన్ని నైవేద్యంగా సమర్పించండి. తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించండి. అందరికీ పంచండి. పెద్దల నుంచి ప్రేమ, ఆశీర్వాదాలు లభిస్తాయి.
ఒకవేళ జీవితంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టాలతో సతమతమవుతుంటే, గురువారం నాడు మహావిష్ణువుకి ఐదు గోమతి చక్రాలను సమర్పించండి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. తర్వాత ఒక గోమతి చక్రాన్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి మీతో పాటు ఉంచుకోండి. ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.