సుఖ, సంపదలు కలగాలంటే.. సోమవారం నాడు శివయ్యను ఇలా పూజించండి-do these on mondays for wealth happiness and many more and problems and difficulties will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సుఖ, సంపదలు కలగాలంటే.. సోమవారం నాడు శివయ్యను ఇలా పూజించండి

సుఖ, సంపదలు కలగాలంటే.. సోమవారం నాడు శివయ్యను ఇలా పూజించండి

Peddinti Sravya HT Telugu

సోమవారం శివుని అనుగ్రహం కలగాలన్నా, శివుని ఆశీస్సులు లభించాలన్నా ఈ పరిహారాలని పాటించడం మంచిది. ఇలా పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించడం వలన శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సకల పాపాలు తొలగిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి.

సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు వీటిని మర్చిపోకండి (pinterest)

శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. శివుడని సోమవారం నాడు ఆరాధించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుందని, సోమవారం నాడు శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. అందుకనే శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు.

సోమవారం నాడు శివుని అనుగ్రహం కలగాలన్నా, శివుని ఆశీస్సులు లభించాలన్నా ఈ పరిహారాలని పాటించడం మంచిది. ఇలా పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించడం వలన శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సకల పాపాలు తొలగిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి.

సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు వీటిని మర్చిపోకండి

1.బిల్వ దళాలతో శివుడిని ఆరాధించండి

ఐశ్వర్యం కలగాలంటే, సోమవారం నాడు శివుడిని బిల్వ దళాలతో ఆరాధించండి. శివునికి ఇవి ఎంతో ఇష్టం. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పైగా బిల్వ దళాల్లో మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

2.గంగాజలం సమర్పించండి

శివుడుని ఆరాధించేటప్పుడు గంగాజలం సమర్పించండి. శివునికి గంగాజలం అంటే చాలా ఇష్టం. సోమవారం నాడు కొద్దిగా గంగాజలాన్ని అభిషేకిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది.

3.విభూతితో అభిషేకం చేయండి

శివుడికి విభూతి సమర్పిస్తే కూడా మనకి ఉన్న కష్టాలు తీరిపోతాయి. సోమవారంనాడు శివునికి విభూతి సమర్పించడం వలన బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే దేవాలయంలో లేదంటే ఎక్కడైనా శివుడికి సమర్పించిన విభూతిని ధరిస్తే సమస్యలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సత్ఫలితాలు కలగాలంటే ఆవు పేడతో చేసిన పిడకల నుంచి తయారు చేసిన విభూతిని ఉపయోగించండి.

4.ఆవు పాలతో అభిషేకం

సోమవారం శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వలన అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి.

సోమవారం శివుడిని ఆరాధించేటప్పుడు వీటిని చదవడం మర్చిపోకండి

శివుడికి భజనలు, కీర్తనలు చాలా ఇష్టం. శివుడిని ఆరాధించేటప్పుడు బిల్వాష్టకం, లింగాష్టకం, శివాష్టకం చదవండి. శివుడిని ఆరాధించి వీటిని చదివితే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయాన్ని అందుకోవచ్చు.

శివుడిని ఆరాధించేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి

  • సోమవారం నాడు శివుడిని ప్రత్యేకించి ఆరాధించేవారు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  • నియమాలతో సోమవారం శివ పూజ చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయండి.
  • శక్తి కొద్ది శివుడికి అర్చనలు, అభిషేకాలు చేస్తే మంచిది.
  • ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ఆరాధించండి.
  • పవిత్రమైన మనసుతో శివుడిని ఆరాధిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం