సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? ఇలా చేస్తే కష్టాలు తీరినట్టే!-do these on monday to get rid of chandra dosha and to get lord shiva blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? ఇలా చేస్తే కష్టాలు తీరినట్టే!

సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? ఇలా చేస్తే కష్టాలు తీరినట్టే!

Peddinti Sravya HT Telugu

శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం శివుడిని ఆరాధించడం వలన ఎన్నో విధాలుగా లాభాలని పొందవచ్చు కూడా. శివుడిని సోమవారం నాడు ఎలా పూజించాలి? వేటిని శివుడికి సమర్పిస్తే మంచిదీ వంటి విషయాలను కూడా ఈ రోజు తెలుసుకుందాం.

సోమవారం నాడు చంద్ర దోష నివారణకు, శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? (pinterest)

హిందూ మతంలో శివుడుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎంత కోపంతో శివుడు ఉంటాడో, అంతే దయ కూడా శివుడులో ఉంటుంది. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని మనం ఆరాధిస్తాము. శివుడిని సోమవారం నాడు ఆరాధిస్తాము. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం అడుగు, చాలామంది శివ భక్తులు ఉపవాసం ఉంటారు.

సోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం శివుడిని ఆరాధించడం వలన ఎన్నో విధాలుగా లాభాలని పొందవచ్చు కూడా. శివుడిని సోమవారం నాడు ఎలా పూజించాలి? వేటిని శివుడికి సమర్పిస్తే మంచిదీ వంటి విషయాలను కూడా ఈ రోజు తెలుసుకుందాం.

సోమవారం శివుడిని ఆరాధించేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

  1. సోమవారం నాడు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి, ఆ తర్వాత శివుడికి నీరు, పాలు సమర్పించాలి. సోమవారం నాడు శివునికి భస్మాభిషేకం చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ రోజు శివుడితో పాటు పార్వతిని కూడా ఆరాధించాలి.
  2. సోమవారం ఉపవాస దీక్షను మొదలుపెట్టాలి. తెల్లవారుజామున శివయ్యకు పూజలు చేయాలి.
  3. బిల్వపత్రాలు, పూలను కూడా సమర్పించాలి.
  4. చివరగా హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించాలి.
  5. సోమవారం నాడు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసంగా ఉండాలి.
  6. సోమవారం నాడు శివుడిని ఆరాధించి ఉపవాసం చేసినప్పుడు పండ్లు తినకూడదు అనే ఎలాంటి నియమాలు లేవు. మూడు గంటల తర్వాత భోజనం చేయవచ్చు.
  7. చాలామంది మూడు సోమవారాలు లేదా 16 సోమవారాలు ఉపవాసం చేస్తారు. శివ పూజ చేశాక కథ చదువుకోవడం లేదా వినడం చాలా ముఖ్యం. సాయంత్రం శివుడికి పూజ చేసి హారతి ఇవ్వాలి. ఇలా సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

చంద్ర దోష నివారణకు సోమవారం నాడు ఇలా చేయండి:

సోమవారం నాడు చంద్ర దోష నివారణ కోసం తెల్లవారుజామున నిద్ర లేచి నియమాల ప్రకారం శివుడిని ఆరాధించాలి. ఈ రోజు తెల్లటి దుస్తులు ధరిస్తే మంచిదే. పేదలకు తెల్లటి వస్త్రాలను దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. జన్మ నక్షత్రం ప్రకారం ఇలా చేయడం వలన చంద్రుని స్థానం బలపడుతుంది.

అదృష్టం కలగాలంటే ఇలా చేయాలి:

అదృష్టం కలగాలంటే సోమవారం నాడు పూజ గదిలో క్రిస్టల్ శివలింగాన్ని పెట్టి, పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. ఆ తర్వాత పంచోపచారాలతో శివుడిని ఆరాధించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.