కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే కష్టం. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. శుక్రవారం రోజు ఇలా చేశారంటే మీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ పద్ధతులు క్రమం తప్పకుండా అనుసరించడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం పొందవచ్చు.
శుక్రవారం రోజు లక్ష్మీ దేవికి ఇష్టమైన మందార పువ్వుతో పూజ చేస్తే సంతోషకరమైన ప్రయోజనాలు పొందుతారు. క్రమం తప్పకుండా ఇలా పూజ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేందుకు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమార్పిస్తే కోరికలు నెరవేరుస్తుందని నమ్ముతారు. ఇంట్లో మందార పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉంటుంది.
లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం అద్భుతమైన సువాసన వెదజల్లే గంధం సమర్పించాలి. దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల అదృష్టం వరిస్తుంది. మల్లెపువ్వులు, తామర పూలతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో తామర పువ్వు విత్తనాలు పెట్టుకున్నా మంచిది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి వాటికి ఉంటుందట.
ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళం వెదజల్లే పూలతో పూజ చేయడం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది. కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టాలి. కొబ్బరిని శ్రీఫలం అంటారు. అంటే లక్ష్మీ ఫలం. అత్యంత స్వచ్చమైనదిగా పరిగణిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.
పవిత్రమైన శుక్రవారం రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందటం కోసం ఖీర్ తయారు చేసి ప్రసాదంగా పంచిపెడితే మంచిది. 21 శుక్రవారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఇలా పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడటం మాత్రమే కాదు మీ కోరికలు నెరవేరుతాయి. ఆవుకు గడ్డి, బెల్లం తినిపించడం వల్ల మేలు జరుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కరుణిస్తుంది.
స్వచ్చమైన నెయ్యితో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం పొందుతారు. నెయ్యి లేదా నువ్వుల నూనెతో పదకొండు దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆవనూనెతో దీపం వెలిగించవచ్చు.