వయస్సు పెరిగిపోతున్నా పెళ్లి మాత్రం కుదరట్లేదా? వచ్చినట్లుగానే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయా? పెళ్లి త్వరగా కుదరాలన్నా, మీ జీవిత భాగస్వామిని మీరు త్వరగా పొందాలన్నా ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయి. మీకు తగ్గ జీవిత భాగస్వామిని పొంది, వివాహం చేసుకోవాలనుకుంటే వీటిని పాటించవచ్చు.
అనేక ప్రయత్నాలు చేసినా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందలేకపోవడం, వివాహంలో ఇబ్బందులు వంటివి జాతకంలో కొన్ని గ్రహ దోషాలు లేదా బలమైన యోగాలు ఫలితంగా జరుగుతూ ఉండవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ అడ్డంకుల్ని తొలగించుకోవడానికి ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయి. వీటిని మనస్ఫూర్తిగా పాటిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
రోజూ శివుడిని పూజించడం వలన త్వరగా పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది. రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగానికి నీరు, పాలు, తేనే సమర్పించాలి. ఆ తర్వాత 'ఓం నమశ్శివాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పెళ్లి కానీ అమ్మాయిలు సోమవారం ఉపవాసం ఉండి జీవిత భాగస్వామి కోసం పార్వతి దేవిని పూజించాలి. శివపార్వతుల వివాహం, ప్రేమ, అంకితభావానికి చిహ్నం.
ఒకవేళ కనక కుజ దోషం ఉన్నట్లయితే వివాహంలో ఆటంకాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే, హనుమంతుడిని పూజించండి. మంగళవారం సుందరకాండను కూడా పఠించండి. హనుమాన్ చాలీసా చదివి, శనగలను, బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించాలి. ఐలా చేస్తే కుజుడుని శాంతింప చేయవచ్చు. వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి.
శుక్రవారం సాయంత్రం నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి, లక్ష్మీదేవిని పూజించాలి. అలా చేయడం వలన తగ్గ భాగస్వామి జీవితంలోకి వస్తారు. ఈ పరిహారాన్ని పాటిస్తే శుక్ర గ్రహాన్ని బలపరచుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
ఎవరి పెళ్లికైనా సహాయం చేయడం లాంటివి చేస్తే కూడా వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామిని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.