Tulsi vivah: రేపే తులసి వివాహం- ఇలా చేశారంటే అష్టదరిద్రాల నుంచి విముక్తి కలుగుతుంది
Tulsi vivah: హిందూ మతంలో తులసి వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు, ఆనందం లభిస్తాయని నమ్ముతారు. వీటితో పాటు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి లేదా ద్వాదశి తిథి నాడు తులసి వివాహం జరుపుకుంటారు. ఈ రోజున తులసి, శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపంతో వివాహం చేస్తారు.
తులసి వివాహాన్ని నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని చెబుతారు. అలాగే మంచి ఆరోగ్యం, ఆనందం, శాంతి, శ్రేయస్సుతో ఆశీర్వదించబడుతుందని ఒక మత విశ్వాసం. ఈ సంవత్సరం దేవుత్తాని ఏకాదశి, తులసి వివాహం నవంబర్ 12 న వచ్చాయి.
చాతుర్మాసంలో విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. అనంతరం దేవుత్తాని ఏకాదశి రోజు మేల్కొంటాడు. అప్పుడే శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి, తులసి దేవికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఏకాదశి లేదా ద్వాదశి రోజు తులసి వివాహం చేస్తే లక్ష్మీనారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి.
దేవుత్తాని ఏకాదశి రోజున ఆచారాల ప్రకారం తులసి వివాహాన్ని నిర్వహించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పవిత్రమైనవిగా భావిస్తారు. తులసి వివాహం రోజున ఏం చేయాలి? ఎలాంటి వస్తువులు దానం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
తులసి వివాహం రోజున ఈ 7 పనులు చేయండి
తులసి వివాహం రోజున తులసి ఆకును శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.
తులసి వివాహం రోజున తులసి మొక్కకు గంగాజలం సమర్పించి సాయంత్రం మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి పూజను విధిగా నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.
శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుతో తులసి వివాహం జరిపించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల తల్లి తులసి సాధకుడికి అఖండ అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు.
తులసి వివాహం రోజున పూజలో పసుపు, గంధం, రోలీని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల ఇంటికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు.
తులసి వివాహ సమయంలో 'ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ ప్రణత్ కేలాశాయ నమో నమః', 'ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందాయ నమో నమః' అనే మంత్రాన్ని జపించవచ్చు.
తులసి వివాహ రోజున ధార్మిక కార్యక్రమాలు కూడా చేయడం మంచిది. ఈ రోజున బ్రాహ్మణులకు బట్టలు, పండ్లు, మిఠాయిలు కానుకగా ఇవ్వాలి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.
తులసి వివాహం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్, పండ్లు సమర్పించాలి. వీటిని విష్ణుమూర్తికి కూడా సమర్పించి పూజ పూర్తయిన తర్వాత వాటిని ప్రసాదంగా పంపిణీ చేయాలి. ఇలా చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.