Lakshmi devi: శుక్రవారం నాడు ఈ 3 పరిహారాలను పాటిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కచ్చు-do these 3 remedies on friday for lakshmi devi blessings wealth increases also gets success and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Devi: శుక్రవారం నాడు ఈ 3 పరిహారాలను పాటిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కచ్చు

Lakshmi devi: శుక్రవారం నాడు ఈ 3 పరిహారాలను పాటిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కచ్చు

Peddinti Sravya HT Telugu

Lakshmi devi: కొంతమంది ఎంతో నిజాయితీగా ఉంటారు. కష్టపడి పని చేస్తూ ఉంటారు. జీవితంలో సంతోషంగా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేకపోతూ ఉంటారు. వీటిని పాటించడం వలన మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవచ్చు.

Lakshmi devi: శుక్రవారం నాడు ఈ 3 పరిహారాలను పాటిస్తే

ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొన్ని పరిహారాలని పాటిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.

కొంతమంది ఎంతో నిజాయితీగా ఉంటారు. కష్టపడి పని చేస్తూ ఉంటారు. జీవితంలో సంతోషంగా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేకపోతూ ఉంటారు. ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఈ సమస్యలను తొలగించుకోవచ్చు:

కెరియర్ లో కానీ బిజినెస్ లో కానీ ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం కూడా కలిసి రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడం మంచిది. శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా చేయడం మంచిది. వీటిని పాటించడం వలన మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవచ్చు.

శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది

1.రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం

రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి.

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తర్వాత రోజు రూపాయి కాసుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ వద్ద ఉంచుకోండి. శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన దురదృష్టం తొలగిపోయి, అదృష్టం కలుగుతుంది.

2.గవ్వలతో ఈ పరిహారం పాటించండి

వ్యాపారంలో సరిగ్గా లాభాలు రాకుండా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లైతే, శుక్రవారం నాడు ఒక పసుపు రంగు గవ్వను తీసుకుని ఎర్రటి గుడ్డలో పెట్టి, ఆ క్లాత్ ని చుట్టండి. ఇంటి బీరువాలో కానీ షాపులో క్యాష్ బాక్స్ లో కానీ పెట్టండి. నెల రోజుల పాటు దీనిని ఉంచండి. శుక్రవారం నాడు లేదంటే పౌర్ణమి నాడు దీన్ని పూజిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన కాసులు వర్షం కురుస్తుంది. మీ క్యాష్ బాక్స్ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోండి.

3.మట్టి కుండ, బియ్యంతో పరిహారం

శుక్రవారం నాడు ఒక చిన్న మట్టికుండను తీసుకుని, దానిలో బియ్యం వేయండి. ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాసు, పసుపు ఉండ వేయండి. దీనిని మూత వేసి, లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకుని పండితుడికి దానం ఇవ్వండి. ఈ విధంగా ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు సంతోషంగా ఉండవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనం