విష్ణు పురాణం మనకి ఎన్నో విషయాలని చెప్పింది. విష్ణు పురాణం ప్రకారం, ఆపద సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి ఇంకొకరికి వీటిని విక్రయించకూడదని చెప్తోంది, పొరపాటున కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. విష్ణు పురాణం ప్రకారం, ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో.. ఎలాంటి సందర్భాల్లో వీటిని విక్రయించకూడదని.. అలా చేసినట్లయితే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడని చెప్పబడింది.
కాబట్టి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విష్ణు పురాణం ప్రకారం వీటిని అమ్మితే దురదృష్టం కలుగుతుంది. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి విష్ణు పురాణంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం.
హిందూ మతం ప్రకారం ఆవుని తల్లిగా భావిస్తారు. వ్యాపార లాభాల కోసం ఎప్పుడూ ఆవు పాలని అమ్మకూడదు. విష్ణు పురాణం ప్రకారం, ఆవుపాలపై హక్కు దూడలకే ఉంది. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందట. కానీ ఈ రోజుల్లో మాత్రం చాలా మంది ఆవు పాలను విక్రయిస్తున్నారు.
విష్ణు పురాణం ప్రకారం బెల్లాన్ని అమ్మడం కూడా మంచిది కాదట. బెల్లం ధనానికి చిహ్నం. అందుకే చాలా మంది ఎవరైనా బెల్లం అడిగితే, డబ్బును తిరిగి తీసుకోరు. విష్ణు పురాణం ప్రకారం, బెల్లాన్ని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టి అమ్మడం మంచిది కాదట. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, నష్టాలని కలిగిస్తుందట.
విష్ణు పురాణం ప్రకారం ఆవాల నూనె కొనుగోలు చేసి ఇంట్లో పెట్టి దానిని మళ్లీ ఎవరికైనా అమ్మడం వలన నష్టాలు కలుగుతాయట. అలా చేసినట్లయితే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం