మీ కూతురుతో ఈ పని చేయించకండి.. నిరంతరం కష్టాలను ఎదుర్కోవాలి, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది!-do not make your daughters do this work or else you must phase problems and even lakshmi leaves ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీ కూతురుతో ఈ పని చేయించకండి.. నిరంతరం కష్టాలను ఎదుర్కోవాలి, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది!

మీ కూతురుతో ఈ పని చేయించకండి.. నిరంతరం కష్టాలను ఎదుర్కోవాలి, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది!

Peddinti Sravya HT Telugu

కుమార్తె ఎప్పుడు కూడా కోపంగా ఉండకూడదు. ఒకవేళ కనుక ఆమె కోపానికి గురైతే లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. చాలామంది తెలుసో తెలియకో తమ కూతుర్లపై కోపగించుకోవడం, కొన్ని పనులు చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని తప్పులు చేయడం వలన నిరంతరం కష్టాలను ఎదుర్కోవాలి.

మీ కూతురుతో ఈ పని చేయించకండి (pinterest)

సనాతన ధర్మంలో ఇంట్లో ఉన్న అమ్మాయిలను దుర్గాదేవిగా పరిగణిస్తారు. నవరాత్రుల సమయంలో కన్యా పూజలు వంటివి చేస్తారు. అటువంటి సమయంలో, ఆ అమ్మాయి పాదాలని కూడా తాకుతారు. పెళ్లి సమయంలో కన్యాదానం తర్వాత ఆమె పాదాలని పూజిస్తారు.

కనుక ఒక కుమార్తె ఎప్పుడు కూడా కోపంగా ఉండకూడదు. ఒకవేళ కనుక ఆమె కోపానికి గురైతే లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. చాలామంది తెలుసో తెలియకో తమ కూతుర్లపై కోపగించుకోవడం, కొన్ని పనులు చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే, కొన్ని తప్పులు చేయడం వలన అశుభం కలుగుతుంది. కూతుళ్ళ చేత కొన్ని పనులు చేయించకూడదు. వారు ఈ పనులు చేసినట్లయితే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

కుమార్తెల చేత ఈ పనులు చేయించకండి

గిన్నెలు కడగడం

కుమార్తెలు చేత మురికి పాత్రలు కడిగించడం వంటివి చేయించకూడదు. లేదా వారికి ఇష్టం లేని పనులు వారి చేత చేయించకండి.

ఈ తప్పులు కూడా చేయకండి

1.అవమానించడం

ఎప్పుడూ కూడా కూతుర్ని అవమానించకూడదు. వారికి తెలియని విషయాలు చెప్పాలి తప్ప వారిని అవమానించడం లాంటివి చేయకూడదు. పెళ్లి అయిన కూతుర్ని కూడా అవమానించడం మంచిది కాదు.

2.బాధ పెట్టడం

అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు బాధగా వెళ్ళకూడదు. ఒకవేళ అలా జరిగినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

3.అప్పు చెల్లించకపోవడం

మీ కూతురు నుంచి ఎప్పుడైనా డబ్బులు మీరు అప్పుగా తెచ్చుకుంటే, వాటిని తిరిగి ఇచ్చేయండి. లేదంటే మీకు అప్పులు ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ జన్మలో కూడా మీకు అప్పులు ఎక్కువైపోతాయి.

4.ఏడిపించడం

మీ కూతురు కళ్ళ నుంచి నీరు రాకుండా చూసుకోండి. వారు ఏడ్చినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే సాయంత్రం పూట ఎప్పుడూ కూడా కూతుర్లను తిట్టకూడదు. అలా చేస్తే కూడా ఇంటికి మంచిది కాదు. ప్రశాంతత ఉండదు. సంతోషంగా ఉండలేరు. దురదృష్టం కూడా కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం