మీ కెరీర్ బాగుండాలా, సక్సెస్ అవ్వాలా? అయితే ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ 4 వస్తువులను తొలగించండి!-do not keep these 4 things in office bag or else you may have to suffer in career ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీ కెరీర్ బాగుండాలా, సక్సెస్ అవ్వాలా? అయితే ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ 4 వస్తువులను తొలగించండి!

మీ కెరీర్ బాగుండాలా, సక్సెస్ అవ్వాలా? అయితే ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ 4 వస్తువులను తొలగించండి!

Peddinti Sravya HT Telugu

జ్యోతిష్యం ప్రకారం, ఆఫీస్ బ్యాగ్ నుంచి వీటిని తొలగించడం మంచిది. చాలామంది ఆఫీస్ బ్యాగ్‌లో చాలా రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వస్తువుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీస్ బ్యాగ్ శుభ్రంగా ఉండడంతో పాటు, కొన్ని వస్తువులను అందులో ఉంచకుండా చూసుకోవడం మంచిది.

ఆఫీస్ బ్యాగ్ నుంచి ఈ 4 వస్తువులను తొలగించండి (pinterest)

ప్రతి ఒక్కరూ లైఫ్‌లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని పాటించడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా కెరియర్‌లో ముందుకు వెళ్లాలని అనుకుంటారు, కష్టపడి పని చేయాలని, సక్సెస్ అందుకోవాలని అనుకుంటారు.

కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ అంత త్వరగా కెరియర్‌లో సక్సెస్‌ను అందుకోలేరు. జ్యోతిష్యం ప్రకారం, ఆఫీస్ బ్యాగ్ నుంచి వీటిని తొలగించడం మంచిది. చాలామంది ఆఫీస్ బ్యాగ్‌లో చాలా రకాల వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వస్తువుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీస్ బ్యాగ్ శుభ్రంగా ఉండడంతో పాటు, కొన్ని వస్తువులను అందులో ఉంచకుండా చూసుకోవడం మంచిది.

ఆఫీస్ బ్యాగ్‌లో ఈ వస్తువులు ఉంటే తొలగించండి:

1.పాత టిక్కెట్లు, అనవసరమైన పేపర్లు

పాత టిక్కెట్లు, అనవసరమైన పేపర్లు, అవసరం లేని విస్టింగ్ కార్డులు, పాత బిల్లులు వంటి వాటిని ఆఫీస్ బ్యాగ్ నుంచి తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తూ, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

2.హైజీన్ ప్రొడక్ట్స్

చాలా మంది ఆఫీస్ బ్యాగ్‌లో హైజీన్ ప్రొడక్ట్స్‌ను పెడుతూ ఉంటారు. వీటిని పొరపాటున కూడా పెట్టకూడదు. దువ్వెన, టూత్ బ్రష్ లాంటి వస్తువులు ఆఫీస్ పనిలో ఉంటే తొలగించడం మంచిది. ఇది ప్రతికూల శక్తిని అందిస్తూ, సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

3.మురికి దుస్తులు

మురికి దుస్తులను కూడా ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టడం మంచిది కాదు. వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆఫీస్ పనిలో ఇలాంటివి ఉంటే కూడా తొలగించడం మంచిది.

4.కత్తి, పదునైన వస్తువులు

వాస్తు ప్రకారం, పదునైన వస్తువులను ఆఫీస్ బ్యాగ్‌లో పెట్టడం మంచిది కాదు. ఇది సానుకూల శక్తిని తొలగించే ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి. తోటి ఉద్యోగస్తులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కెరియర్‌లో ఆటంకాలు రావచ్చు. కాబట్టి వీటిని కూడా తొలగించడం మంచిదే.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.