పొరపాటున కూడా ఈ ఐదుగురిని అవమానించకండి.. శని ఆగ్రహంతో హఠాత్తుగా ఊహించని నష్టాలు కలగవచ్చు-do not insult these 5 even by mistake or else you may suffer with shani dev anger ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పొరపాటున కూడా ఈ ఐదుగురిని అవమానించకండి.. శని ఆగ్రహంతో హఠాత్తుగా ఊహించని నష్టాలు కలగవచ్చు

పొరపాటున కూడా ఈ ఐదుగురిని అవమానించకండి.. శని ఆగ్రహంతో హఠాత్తుగా ఊహించని నష్టాలు కలగవచ్చు

Peddinti Sravya HT Telugu

మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన శని దేవుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడూ పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. ఇలా చేయడం వలన శని ఆగ్రహం చెందుతాడు. శని ఆగ్రహంతో హఠాత్తుగా ఊహించని నష్టాలు కలగవచ్చు.

పొరపాటున కూడా ఈ ఐదుగురిని అవమానించకండి

జ్యోతిష్య శాస్త్రంలో శనిని అత్యంత శుభగ్రహంగా భావిస్తారు. ఏ రాశిలో అయితే శని ప్రయాణిస్తాడో ఆ రాశి వారికి దారుణ ప్రభావాలని ఇస్తాడు. శని రెండున్నర ఏళ్ల పాటు ఉంటే ధయ్యా అని అంటారు. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ఒక రాశిలో ఉండి ఆ తర్వాత రాశిని మారుస్తాడు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన శని దేవుడు అశుభ ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడూ పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. ఇలా చేయడం వలన శని ఆగ్రహం చెందుతాడు.

ఎప్పుడూ కూడా ఈ ఐదుగురిని అవమానించకూడదు

ఎప్పుడూ వీళ్ళను అవమానించకండి. వీరిని అవమానిస్తే శని దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

1.శ్రామికులు

శ్రమించే శ్రామికులని అవమానిస్తే శని దేవుడికి ఎంతో కోపం వస్తుంది. వారిని బాధ పెట్టడం. దూషించడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే శని దేవుడు విపరీతమైన నష్టాన్ని అందిస్తాడట.

2.వికలాంగులు

వికలాంగులను కూడా ఎప్పుడూ అవమానించకూడదు. అలాంటి వారిని బాధపడితే శని దేవుడికి చాలా బాధ కలుగుతుంది. ఆగ్రహం చెంది అనేక నష్టాలని అందిస్తాడు. ఎంతో అందమైన జీవితం ఒక్కసారిగా ముక్కలైపోతుంది.

3.పెద్దలు

పెద్దవాళ్ళని అవమానించడం, బాధ పెట్టడం చేస్తే శని దేవుడికి కోపం వస్తుంది. ఎప్పుడు కూడా పెద్దవారిని గౌరవించాలి. వారిని తిట్టడం అవమానించడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కూడా శని దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. శని దేవుని ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది.

4.పారిశుధ్య కార్మికులు

పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను కూడా అవమానించడం, బాధ పెట్టడం లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే కూడా శని దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది.

5.మహిళలు

మహిళల్ని అవమానిస్తే కూడా శని దేవుడికి కోపం వస్తుంది. మహిళలను తిట్టడం, అవమానించడం లాంటివి చేస్తే శని దేవుడు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాడు. లక్ష్మీదేవి కూడా మహిళల్ని అవమానించే వారిని విడిచిపెట్టదు. కాబట్టి ఎప్పుడూ పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. లేకపోతే శని దేవుని ఆగ్రహం వలన తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.