చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, సానుకూల శక్తి వ్యాపించే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు నియమాలను పాటించడం వలన సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. మనకు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఎటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవాలో తెలుసుకోండి.
ఒక్కోసారి మనం ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కానీ ఎవరైనా మనం ఇష్టపడేవారు మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ బహుమతుల్ని ఇస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం బహుమతులు ఇచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఈ తప్పులు చేయడం వలన కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొన్ని బహుమతులు ఇవ్వడం వలన ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం దెబ్బతింటుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి బహుమతులు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాటిని ఇవ్వకుండా చూసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
నలుపు రంగు చూడడానికి చాలా బాగా కనబడుతుంది. చాలా మందికి నలుపు ఫేవరెట్. కానీ, నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. నలుపు రంగులో ఉండే షు, వాచీలు వంటివి ఇవ్వకండి. ఇలాంటివి ఇవ్వడం వలన బంధం దెబ్బతింటుంది.
చాలా మంది సువాసన వచ్చే పెర్ఫ్యూమ్స్ ని ఇస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అందరూ వాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా పెర్ఫ్యూమ్స్ ని గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం ఎవరికీ పర్సుని కూడా గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. ఇది కూడా జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక నష్టాలని తీసుకువస్తుంది. కాబట్టి దీనిని కూడా బహుమతిగా ఇవ్వకండి.
ముత్యాలను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ముత్యాలు వేసుకుంటే అందంగా ఉంటుంది. కానీ అవి కన్నీళ్ళకు చిహ్నం. కాబట్టి ముత్యాలని కూడా ఎప్పుడూ ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి.
వాస్తు ప్రకారం జేబు రుమాలును కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. వాస్తు ప్రకారం జేబు రుమాలిని బహుమతిగా ఇవ్వడం అశుభం. ఇది జీవితంపై ప్రతికూలతను తీసుకువస్తుంది. బంధంలో బాధలను స్వాగతిస్తుంది. కాబట్టి దీనిని కూడా బహుమతిగా ఇవ్వకండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.