దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూర్తి ఫలితం కలగాలంటే ఈ తప్పులు చేయకండి.. ఎక్కువ మంది చేసే ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?-do not do these mistakes when going to temple many do not know these ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూర్తి ఫలితం కలగాలంటే ఈ తప్పులు చేయకండి.. ఎక్కువ మంది చేసే ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూర్తి ఫలితం కలగాలంటే ఈ తప్పులు చేయకండి.. ఎక్కువ మంది చేసే ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

Peddinti Sravya HT Telugu

ఆలయ సందర్శనలో కొన్ని నియమాలు పాటిస్తే మరిన్ని శుభాలు పొందవచ్చు. ఇవి తప్పనిసరి నియమాలు కానప్పటికీ, భగవంతుని అనుగ్రహం కోసం మీరు అలా చేస్తే, చాలా ప్రయోజనాలు మీకే చెందుతాయి. . ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు?, చాలా మంది తెలియక చేసే తప్పులు గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

దేవాలయానికి వెళ్ళేటప్పుడు పూర్తి ఫలితం కలగాలంటే ఈ తప్పులు చేయకండి

కొందరు ప్రతిరోజూ ఆలయానికి వెళ్తుంటారు. చాలా సేపు ఆలయంలోనే గడుపుతారు. అయినా ప్రయోజనం ఉండకపోవచ్చు. దీనికి కారణం మనం చేసే అనేక పొరపాట్లు. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు?, చాలా మంది తెలియక చేసే తప్పులు గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

చాలా మంది ఆలయానికి వెళ్ళేటప్పుడు చేసే పొరపాట్లు:

  1. ఉదయాన్నే ఆలయానికి వెళ్లే ముందు స్నానం చేయాలి. కానీ గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు. ఒకవేళ ఆలా స్నానం చేస్తే ఆరాధన ఫలితం ఉండదు.
  2. అదే విధంగా సాయంత్రం ఆలయానికి వెళ్లే వారు స్నానమాచరించి ఆలయానికి వెళ్ళక్కర్లేదు. అవసరమైతే సూర్యాస్తమయానికి ముందే స్నానం చేసి ఆలయానికి వెళ్లాలి.
  3. రాత్రి పూట శ్రీ సూర్యదేవునికి, శ్రీ నాగప్పకు పూజలు చేయకూడదు. కానీ సూర్యాస్తమయానికి ముందు సూర్యుడిని పూజించవచ్చు.
  4. చీకటి సమయాల్లో ఆలయంలో పూజలు చేయకూడదు. అలా చేస్తే ఏ రకంగానూ మంచి ఫలితాలను పొందడం సాధ్యం కాదు.
  5. ఆలయానికి వెళ్లే స్త్రీ పురుషులు నుదుటిపై కుంకుమ లేదా తిలకం ధరించాలి.
  6. ఆలయానికి వెళ్లే ముందు ఉదయం, సాయంత్రం ఇంట్లోని పూజ మందిరంలో దీపం వెలిగించాలి. స్వచ్ఛమైన నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం చాలా ముఖ్యం.
  7. ఆ తర్వాత ఇంటి నుంచే ఆలయానికి పూజా సామగ్రిని తీసికెళ్ళచ్చు.

ఈ తప్పులు కూడా చేయకండి

  • ఇంట్లో రోజూ వండుకునే అన్నం, పప్పు మొదలైన వాటిని దేవుడికి సమర్పించడంలో తప్పులేదు.
  • ఇంటి నుంచి ఆలయానికి బయలుదేరే కుటుంబ పెద్దలకు ఆలయానికి వెళ్లే విషయాన్ని తెలియజేయాలి. వారి ఆశీస్సులు లేదా శుభాకాంక్షలు పొందాలి.
  • ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి తినడానికి లేదా తాగడానికి ఏమైనా ఇచ్చి, ఆలయానికి తీసుకెళ్ళచ్చు. అందులో తప్పు లేదు.
  • గుడి ఇంటికి దగ్గరలో ఉన్నా, పాదాలు కడుక్కుని ఆలయంలోకి ప్రవేశించడం తప్పనిసరి.
  • పూజా సామగ్రితో పాటు ఒక రూపాయి కాసుని కూడా ఉంచడం చాలా ముఖ్యం. కేవలం పూలు, ధూపం, కర్పూరం, పండ్లు, కొబ్బరికాయలను మాత్రమే ఆలయానికి తీసుకెళ్లకూడదు. తమలపాకు ముక్క, ఒక వక్క, రూపాయి కాసు వాటిలో పెట్టండి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.
  • ప్రతిరోజూ పూజా సామగ్రిని తీసుకెళ్లాలనే నియమం లేదు.
  • మూలవిరాట్టు దగ్గర పెద్ద సంఖ్యలో జనం ఉంటే కొందరు నవగ్రహాలకు నమస్కరిస్తారు. ఇది సరైన పద్దతి కాదు.
  • ఏ దేవాలయమైనా ముందుగా గణపతిని దర్శించుకోవాలి. ఆ తరవాత మిగిలిన దేవుళ్ళు, దేవతలకు నమస్కరించాలి.
  • నవగ్రహాలను ఇంటికి తిరిగివచ్చే సమయంలో మాత్రమే పూజించాలి. కానీ నవగ్రహాలకు తలవంచకూడదు.
  • ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్లు కడుక్కోకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.