వారంలో నాలుగవ రోజైన గురువారం నాడు కొన్ని తప్పులు చేయకూడదు. చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో గురువారం నాడు ఈ తప్పులు చేయకండి.
చాలా మంది ఎవరికైనా అప్పు కావాలంటే వారికి డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో గురువారం నాడు ఎవరికీ డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు. గురువారం మహావిష్ణువు, లక్ష్మీదేవిల రోజు.
ఈరోజు ఎవరికైనా డబ్బు ఇస్తే విష్ణుమూర్తికి ఆగ్రహం కలుగుతుంది. ఇది దురదృష్టాన్ని కలిగించడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. కాబట్టి అప్పు ఇవ్వడం మంచిది కాదు.
గురువారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం లేదా పెడిక్యూర్, మానిక్యూర్, ఐబ్రోస్ చేయించుకోవడం వంటివి చేయకూడదు.
గురువారం నాడు నోటితో గోళ్లను కొరకడం కూడా మంచిది కాదు. ఇలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకుంటే, విష్ణుమూర్తికి ఆగ్రహం కలగకుండా ఉంటుంది.
గురువారం నాడు పసుపు రంగు ఆహార పదార్థాలను తినడం మంచిది కాదు. పసుపు రంగు వస్తువులని దానం చేయొచ్చు. కానీ పసుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను గురువారం నాడు తినకూడదు. ఈ పొరపాటు చేస్తే కూడా విష్ణువుకి ఆగ్రహం కలుగుతుంది.
నూనె, నెయ్యి, చీజ్ వంటి వాటిని గురువారం నాడు కొనుగోలు చేయడం మంచిది కాదు. ఇలాంటివి కొనుగోలు చేసినా కూడా విష్ణుమూర్తికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ తప్పు చేయకండి.
గురువారం నాడు ఇల్లు సర్దుకోవడం, బూజులు దులపడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా మూల మూలల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసి సర్దుకోవడం వంటివి గురువారం నాడు చేయకూడదు. ఇది కూడా విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగించి, ఇబ్బందుల్ని ఎదుర్కొనేలా చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం